Tuesday, May 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేడే ర్యాలీ, బహిరంగ సభ విజయవంతం చేయాలి

మేడే ర్యాలీ, బహిరంగ సభ విజయవంతం చేయాలి

- Advertisement -

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు మల్లేశం
నవతెలంగాణ-ఆలేర్ రూరల్ 

మేడే వారోత్సవాల సందర్భంగా ఈనెల 7న భువనగిరిలో నిర్వహించనున్న భారీ ర్యాలీ మరియు బహిరంగ సభను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం మార్కెట్ యార్డుల్లో హమాలీ కార్మికులతో కలిసి మేడే వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కల్లూరు మల్లేశం మాట్లాడుతూ కేంద్రంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2014 నుండి కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న పలు కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చారని తెలిపారు.

ప్రపంచ కార్మిక వర్గంతో పాటు భారత కార్యవర్గం ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని సమ్మె హక్కును కార్మికుల అవసరాలకు అనుగుణంగా జీతభత్యాలు సంక్షేమ పథకాలు లాంటివి కోల్పోవాల్సిన స్థితి ఏర్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోట్లు వచ్చాయి మళ్లీ బ్రిటిష్ కాలం నాటి ఆటవిక పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు. ఆనాడు ఎనిమిది గంటల పని దినం కోసం ఏదైతే 1886 చికాగో చికాకు అమరవీరుల త్యాగాల స్ఫూర్తిని తీసుకొని మళ్లీ 14 వ మేడేను పోరాట దినముగా 2026 మే 1 నుండి 7 వరకు వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, మే 1న మండల కేంద్రంలో మే 7న ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభను  యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పిలుపునిస్తుందని ఆయన అన్నారు. ఈ బహిరంగ సభకు అన్ని రంగాల కార్మికులు సకాలంలో హాజరై విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు. కార్యక్రమంలో మార్కెట్ హమాలి కార్మిక సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్, సభ్యులు జోగు కుమార్,గెటప్ పాండు,నరసయ్య,రేగు బీరయ్య,పెద్ది ఐలయ్య, ప్రభాకర్,పుప్పాల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -