Tuesday, May 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హెచ్‌ఎంటీ కాలనీలో సీసీటీవీ కెమెరాలపై అవగాహన

హెచ్‌ఎంటీ కాలనీలో సీసీటీవీ కెమెరాలపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – నాచారం
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్‌ఎంటీ కాలనీలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సీసీటీవీ కెమెరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నాచారం పోలీస్ ఎస్‌హెచ్‌ఓ ధనుంజయ్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ మాన్‌సింగ్, ఎస్‌ఐ విజయ హాజరై ప్రజలకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రస్తుతం పెరుగుతున్న నేరాల నివారణలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. కాలనీల్లో, ఇండ్ల వద్ద మరియు ప్రధాన రహదారుల వద్ద కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా అనుమానాస్పద కదలికలను సులభంగా గుర్తించవచ్చని చెప్పారు.అలాగే, ఏదైనా ఘటన జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు కీలక ఆధారంగా ఉపయోగపడుతుందని, నేరస్తులను త్వరగా పట్టుకోవడంలో ఇది ఎంతో సహాయపడుతుందని వివరించారు. ప్రజలు తమ భద్రత కోసం ముందడుగు వేసి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పోలీసులతో సమన్వయం కలిగి పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -