Wednesday, May 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మధుర తండాలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్

మధుర తండాలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని మధుర తండా లో చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ అనిత మోహన్ చౌహాన్ ప్రారంభించారని జీపి కార్యదర్శి స్రవంతి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అనిత మాట్లాడుతూ తీవ్రమైన  ఎండలు కాస్తున్న క్రమంలో గ్రామానికి వచ్చి అతిథులు గ్రామస్తులు త్రాగునీటికి ఇబ్బందికి కలుగకుండా ముందస్తుగా జిపి ఆధ్వర్యంలో త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించామని అన్నారు. చలివేంద్రం ద్వారా తండాలోని పిల్లలు , పెద్దలు , గ్రామానికి వచ్చే అతిథిలు,  బంధువులు,  అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా గ్రామంలోని మాజీ సర్పంచ్ సంజీవ్ చౌహాన్ నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశాన్ని గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగింది అని మాజీ సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు , ఉప సర్పంచ్ , జిపి కార్యవర్గ సభ్యులు, జిపి కార్యదర్శి, గ్రామస్తులు, తాండవాసులు,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -