నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మధుర తండా లో చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ అనిత మోహన్ చౌహాన్ ప్రారంభించారని జీపి కార్యదర్శి స్రవంతి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అనిత మాట్లాడుతూ తీవ్రమైన ఎండలు కాస్తున్న క్రమంలో గ్రామానికి వచ్చి అతిథులు గ్రామస్తులు త్రాగునీటికి ఇబ్బందికి కలుగకుండా ముందస్తుగా జిపి ఆధ్వర్యంలో త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించామని అన్నారు. చలివేంద్రం ద్వారా తండాలోని పిల్లలు , పెద్దలు , గ్రామానికి వచ్చే అతిథిలు, బంధువులు, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా గ్రామంలోని మాజీ సర్పంచ్ సంజీవ్ చౌహాన్ నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశాన్ని గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగింది అని మాజీ సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు , ఉప సర్పంచ్ , జిపి కార్యవర్గ సభ్యులు, జిపి కార్యదర్శి, గ్రామస్తులు, తాండవాసులు, తదితరులు పాల్గొన్నారు.
మధుర తండాలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



