నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు నూతనంగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సాదరంగా ఆహ్వానించి, వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గం లోని మండలాల వారిగా పార్టీ అధ్యక్షులు నియామకాలు జరిగాయని అన్నారు. మహమ్మద్ నగర్ మండలంనకు ఎన్. రవీందర్ రెడ్డి, నిజాంసాగర్ మండలానికి పి. పండరి, పిట్లం మండలానికి మెగావత్ రవీందర్, పెద్ద కొడప్ గల్ మండలానికి మాదప్పావార్ శామప్ప , డోంగ్లి మండలానికి గజానన్, జుక్కల్ మండలానికి కులకర్ణి రమేష్ , మద్నూర్ మండలం ధరస్ వార్ సాయిలు , బిచ్కుంద మండలానికి మున్నూరు వార్ నాగనాథ్ , బిచ్కుంద టౌన్ అధ్యక్షుడిగా కే విజయభాస్కర్ రెడ్డి లను రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మరియు కార్యవర్గ సభ్యులు నియామకం చేయడం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా, స్థానిక సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా ఉండి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని దిశానిర్దేశం చేశారు.
నూతన మండల కాంగ్రెస్ అధ్యక్షులకు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



