ఇంచార్జీలుగా కొలువుదిరిన సొసైటీ పాలక వర్గం
నవతెలంగాణ – దర్పల్లి
ప్రాథమిక సహకార సంఘాల్లో సొసైటీ పాలక వర్గం పదవి కాలం ముగిసింది సంవత్సరం కానుంది. అప్పట్లో స్థానిక ఎన్నికల దృష్ట్యా కొంతకాలం పాలకవర్గం పదవికాలం పొడగిస్తూ ఉత్తర్వులు రావడంతో కొన్ని నెలలు విధులు నిర్వహించగా..ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియడంతో ప్రత్యేక అధికారులతో సొసైటీలను ప్రభుత్వం కొనసాగించింది. కాగా మరోదఫా ప్రభుత్వం పాత సొసైటీ పాలక వర్గానికి ఇంచార్జులుగా నియమించాలని ఉన్నత అధికారులకు ఉత్తర్వులు రావడంతో బుధవారం ప్రత్యేక అధికారులు పాత పాలకవర్గాలకు ఛార్జి అందించారు. ఇందులోభాగంగా దర్పల్లి మండలంలోని హోన్నజీపేట, రామడుగు, దర్పల్లి సొసైటీల్లో అధికారులు పాత వర్గానికి చాజీలు అప్పచెప్పారు.
ఈ సందర్బంగా దర్పల్లి సొసైటీ ప్రత్యేక అధికారి చేర్మెన్ చెలిమేల మల్లికార్జున్ తోపాటు డైరెక్టర్లకు కు పదవి బాధ్యతలు అప్పగించారు. కొత్తగా ఛార్జ్ తీసుకున్న పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ చేర్మెన్ మళ్ళీ కార్జున్ తోపాటు, కార్యక్రమానికి అతిథులుగా పాల్గొన్న జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, దర్పల్లి గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ గార్లకు ప్రత్యేక అధికారి మురళి శాలువాలతో సత్కరించారు. అనంతరం అయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల అనుసారం పాత పాలక వర్గానికి ఇంచార్జీలుగా తిరిగి నియమించడం జరిగిందని అన్నారు. కార్యక్రమములో డైరెక్టర్లు, సభవత్ శ్రీనివాస్, బాలు, నౌసి, పుప్పాల మహేందర్, విట్టల్, సాలెహ బేగం, పెండ ప్రమీల, పోత రాజు, రఘు, నర్సాగౌడ్ వై గంగారెడ్డి, కోటాల్ పల్లి మాజీ సర్పంచ్ మురళి, సొసైటీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



