Wednesday, May 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ అఖిలభారత మహాసభలను విజయవంతం చేయాలి

 అఖిలభారత మహాసభలను విజయవంతం చేయాలి

- Advertisement -

రైతులను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మోడీ విఫలం 
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ త డివిజన్ కార్యదర్శి మంజంపల్లి వీరన్న 
నవతెలంగాణ-నెల్లికుదురు 

మే 11, 12,13 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగే రైతు సంఘం అఖిలభారత మహాసభలను ఏ ఐ యు కే ఎస్ జయప్రదం చేయాలని సిపిఐ ఎంల్ మాస్ లైన్ తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న అన్నారు. అఖిలభారత ఐక్య రైతు సంఘం కై నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామo లో రైతులను కలిసి మహాసభల పోస్టర్ను ఆవిష్కరించే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..  దేశానికి అన్నం పెట్టే రైతు ప్రజల కడుపు నింపుతూ తను కష్టాల కొలిమిలో కాలుతున్నాడని అన్నారు. భూమిలో విత్తనం నాటిన నుండి పంట తోలుకొని మార్కెట్లో అమ్మే వరకు అడుగడుగునా దగాకు, దోపిడీకి గురవుతున్న ఏకైక వ్యవస్థ రైతు దేనని అన్నారు. పుండు మీద కారం చల్లిన చందంగా అతివృష్టి అనావృష్టి లతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలు రైతులకు ఉరితాలుగా మారుతున్నాయని అన్నారు.

విత్తనాలు,ఎరువులు,  పురుగుమందులు కల్తీ, కూలీల కొరత, మార్కెట్లో దళారీల బెడద ఒకటేమిటి అన్ని రైతుకి ప్రతి బంధ కాలే నని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనే భారత వ్యవసాయ రంగం, రైతాంగం పట్ల  కార్పొరేట్ శక్తుల కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ఇచ్చిన హామీ విస్మరించి పంట గిట్టుబాటు ధర చట్టం చేయటం లేదన్నారు. ఎరువులకు విత్తనాలకు పురుగుమందులకున్న సబ్సిడీని పూర్తిగా రద్దుచేసి కంపెనీలకు స్వేచ్ఛనిస్తున్నారని విమర్శించారు. బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం అప్పులు ఇవ్వక ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రైతులు మోసపోతున్నారని అన్నారు.

కౌలు  రైతులు సమస్యలు చెప్పనలివి కాకుండా ఉన్నాయని అన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఇల్లందులో జరిగే అఖిల భారత ప్రథమ మహాసభలలో వివరంగా చర్చించనున్నామని అన్నారు. రైతు పక్షపాతి వడ్డే శోభనాదీశ్వరరావు, ప్రదీప్ సింగ్ ఠాకూర్,ఇల్లందు ఎమ్మెల్యే మాజీ గుమ్మడి నరసయ్య, పోటు రంగారావు తదితరులు హాజరుకానున్నారని అన్నారు. మొదటిరోజు బహిరంగ సభ ప్రదర్శన సుమారు 25 వేల మందితో జరగనుందని రెండవ రోజు ఎంపిక చేసిన ప్రతినిధులు 16 రాష్ట్రాల నుండి హాజరుకానున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఈర్ల వెంకన్న ఆమంద వెంకన్న,కావటి రమేష్,వెంకన్న, మల్లయ్య, కొమురయ్య, శ్రీకాంత్, రమేష్*తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -