Thursday, May 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొండాపూర్ పోలీసుల అవినీతిపై విచారణ జరపాలి

కొండాపూర్ పోలీసుల అవినీతిపై విచారణ జరపాలి

- Advertisement -

కేసుల బెదిరింపులతో వసూళ్లు : గౌరీ రెడ్డి శ్రీధర్ రెడ్డి
నవతెలంగాణ-కొండాపూర్

కొండాపూర్ పోలీసులు తప్పుడు కేసులు, బెదిరింపులతో ప్రజలను వేధిస్తూ లంచాలు వసూలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత, వైసీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గౌరీ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. సంగారెడ్డి డీఎస్పీ, కొండాపూర్ సీఐ, ఎస్‌ఐలపై డీజీపీ, ఏసీబీ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత నరసింహారెడ్డికి పోలీసులు ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తున్నారని విమర్శించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, సెటిల్మెంట్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గంజాయి, డ్రగ్స్ వ్యాపారులతో కొందరు పోలీసులకు సంబంధాలున్నాయని అన్నారు. తన ఆరోపణలు తప్పైతే తనపై చర్యలు తీసుకోవచ్చని శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -