Thursday, May 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో అనేక లాభాలు

సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో అనేక లాభాలు

- Advertisement -

ఏడీఈ రాజశేఖర్
నవతెలంగాణ – ఆలేరు రూరల్

సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ రాజశేఖర్ తెలిపారు.గురువారం ఆలేరు మండలం గొలనుకొండ గ్రామ రైతు వేదికలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ,వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏడీఈ  రాజశేఖర్,ఏ ఈ  మిట్ట వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు  పీఎం కుసుం పథకం ద్వారా రైతులకు సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు అందిస్తోందన్నారు.

వ్యవసాయ క్షేత్రాల్లో సౌర విద్యుత్ వినియోగం వల్ల విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని వివరించారు.ప్రకృతిలో సహజంగా లభించే సౌరశక్తిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం ద్వారా సాంప్రదాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చన్నారు. రైతులు అవసరమైన నియంత్రణ పరికరాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాలను వెల్లడిస్తూ ఒక కిలోవాట్‌కు రూ.30 వేల వరకు, రెండు కిలోవాట్లకు రూ.60 వేల వరకు, మూడు కిలోవాట్లకు రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. సౌర విద్యుత్ వినియోగం ద్వారా నెలవారీ విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ షకీరా,అసిస్టెంట్ ఇంజనీర్ మిట్ట వెంకటేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -