Thursday, May 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తడిసిన ధాన్యానికీ పూర్తి మద్దతు ధర

తడిసిన ధాన్యానికీ పూర్తి మద్దతు ధర

- Advertisement -

రైతులకు భరోసా కల్పించిన ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమల
నవతెలంగాణ-కాటారం 

అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్పర్సన్ పంతకాని తిరుమల రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా మహాదేవపూర్, కాటారం, రేగులగూడెం, గంగారం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, తూకాలు, రవాణా తదితర ఏర్పాట్లను పరిశీలిస్తూ రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర మంత్రి గౌరవ శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు పంతకాని తిరుమల తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ  అధికార ప్రతినిది పంతకాని సమ్మయ్య, నాయకులు తెప్పల  దేవేందర్ రెడ్డి, పాగె సురేష్, మారపాక రాజు, సత్తి రెడ్డి, ఏఎంసీ మరియు పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -