Thursday, May 7, 2026
E-PAPER
Homeసినిమాఅగధ.. ఓ విజువల్‌ వండర్‌

అగధ.. ఓ విజువల్‌ వండర్‌

- Advertisement -

ఎం.ఎస్‌.రాజు రచన, దర్శకత్వంలో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ‘అగధ’ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఏకకాలంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజరు కుమార్‌, సిజ్జు, రోషన్‌, శ్రేయరాణి రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా గురువారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఎం.ఎస్‌.రాజు మాట్లాడుతూ, ‘నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన ‘అగధ’ని ఈ స్థాయికి తీసుకు వచ్చిన నా సోదరి సమానురాలైన విశాలాక్షి, డా. రాజు, సుబ్బరాజు, ఇంకో మిత్రుడికి థ్యాంక్స్‌. టెక్నీషియన్ల పనితనం, ఆర్టిస్టుల వర్క్‌ ఎలా ఉండబోతోందో టీజర్‌ చూస్తేనే అర్థమై ఉంటుంది. విజువల్‌ వండర్‌గా ఈ సినిమా ఉంటుంది. టీజర్‌లో చూపించని ఎన్నో అంశాలు సినిమాలో ఉం టాయి. మహాదేవిగా కామాక్షి డెడికేషన్‌, సిన్సియారిటీకి హ్యాట్సాఫ్‌. ఈ ప్రాజెక్టులో ‘పొలిమేర’ ఫేమ్‌ అనిల్‌ ఎంతో సపోర్ట్‌ చేశారు. శ్రవణ్‌ లేకపోతే ఈ సినిమా లేదు. ఈ మూవీతో శ్రవణ్‌ వేరే రేంజ్‌కి వెళ్తాడు. ఉల్కా అద్భుతమైన నటి. మంజుల మనవరాలు, వనిత కూతురు జోవిక ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు’ అని అన్నారు. ‘మా అన్న ఎం.ఎస్‌. రాజు వల్లే సినిమా నిర్మాణంలోకి వచ్చాను. మా టీజర్‌ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. మా సినిమాని అందరూ చూసి హిట్‌ చేస్తారని ఆశిస్తున్నాను’ అని నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు చెప్పారు. కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ,’ఇలాంటి ఓ అద్భుతమైన చిత్రంలో మహాదేవి పాత్రను నేను పోషించగలను అని నమ్మిన ఎం.ఎస్‌.రాజుకి థ్యాంక్స్‌. కొన్ని సినిమాలు మాత్రమే మనతో నిత్యం ఉండిపోతాయి. ఇది అలాంటి ఓ సినిమానే అవుతుంది’ అని తెలిపారు. జర్నలిస్ట్‌లు నిశాంత్‌, ప్రభు, నాగేంద్ర కుమార్‌ సురేష్‌ కొండేటి, టీవీ5 రాంబాబు తదితరులు దర్శకుడిగా, నిర్మాతగా ఎం.ఎస్‌.రాజు విజన్‌ని, ఆయన నిర్మించిన చిత్రాలతోపాటు ఈ చిత్రంలోని ప్రత్యేకతలను ప్రస్తావిస్తూ కొనియాడారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: రాకేష్‌ వెంకటాపురం, సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవ్‌ నాయర్‌, అదనపు స్క్రీన్‌ ప్లే: చైతన్య వేగి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎన్‌ వి ఎన్‌ సుబ్బరాజు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -