Friday, May 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పడంపల్లిలో పశువులకు టీకాల పంపిణీ

పడంపల్లిలో పశువులకు టీకాల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పడంపల్లి సర్పంచ్ వాగ్మారే విజయ కుమారి అధ్యక్షతన శుక్రవారం 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా పశువులకు ఉచిత టీకాలు సర్పంచ్ చేతుల మీదుగా ప్రారంభించారని వెటర్నరీ వైద్యుడు పండరినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..నట్టల నివారణ మందులు, వేసే విధానం పైన పాడి రైతులకు అవగాహన, ప్రభుత్వం అందిస్తున్న వివిధ సబ్సిడీలు పథకాల గురించి వివరించారు. అదేవిధంగా సంతానూర్ పూర్తి శిబిరం, మేలు జాతి చూడల ప్రదర్శన, పశు గ్రాస విత్తనాల పంపిణి , వేసవి పశు సంరక్షణ వసతి పైన అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ పౌడే సవిత బస్వంత్ , వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ గంగాధర్  మరియు గ్రామ ప్రజలు, మండల పశు వైద్యాధికారి పండరినాథ్  పంచాయతీ కార్యదర్శి, గోపాలమిత్ర మండల బృందం తదితరులు పాల్గొనడం జరిగింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -