Saturday, May 9, 2026
E-PAPER
Homeమానవిఇద్దరికీ సర్ది చెప్పాలి

ఇద్దరికీ సర్ది చెప్పాలి

- Advertisement -

అత్తా కోడలి మధ్య గొడవలు సహజం. కానీ అది ఎంత వరకు. వాటికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. గొడవలు ఇంట్లో నుండి బయటకు పోనంత వరకు మాత్రమే అది సహజం. అలా కాకుండా ఆ గొడవలు బయటకు వచ్చాయంటే మాత్రం వాటి గురించి ఆలోచించాల్సిందే. ఇంట్లో అత్తాకోడలి మధ్య గొడవలు జరిగితే సర్ది చెప్పాల్సింది కొడుకు స్థానంలో వున్న భర్త. తల్లీ భార్యకు మధ్య మనస్పర్దలు వస్తే ఇద్దరినీ బుజ్జగించి ఎవరి మనసూ నొచ్చుకోకుండా సర్ది చెప్పాలి. అలా కాకుండా తల్లి చెప్పిన మాటలు విని భార్యను కొట్టడం, భార్య మాటలు విని తల్లిని తిట్టడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల సమస్యలు మరింత పెరిగిపోతాయి. అలాంటి కథనమే ఈవారం ఐద్వా అదాలత్‌(ఐలమ్మ ట్రస్ట్)లో మానవి పాఠకుల కోసం…

లాస్యకు దాదాపు 32 ఏండ్లు ఉంటాయి. ఆమెకు నవీన్‌‌తో పెండ్లి జరిగి ఏడాది అవుతుంది. నవీన్‌కు మూడేండ్లు ఉన్నపుడు అతని తండ్రి చనిపోయాడు. ఇంట్లో ముగ్గురు మాత్రమే ఉంటారు. అక్కకు పెండ్లి జరిగి పదేండ్లు అవుతుంది. చిన్న కుటుంబం ఎలాంటి ఇబ్బందులూ లేవని లాస్యకు పెండ్లి చేసింది. లాస్య వాళ్లది పెద్ద కుటుంబం. ఏడు మంది అక్కలు, ఐదు మంది అన్నలు వున్నారు. అందరి పిల్లలను కలిపి మొత్తం 50 నుండి 60 మంది అవుతారు. లాస్య చిన్నది కాబట్టి చిన్న కుటుంబమైతే ఎలాంటి ఇబ్బందులూ ఉండవని తల్లి భావించింది. అయితే అత్త వెంకటమ్మకు లాస్యకు అస్సలు పడేది కాదు. నవీన్‌ ప్రయివేటు ఉద్యోగి. పెండ్లి తర్వాత లాస్య ఇంట్లోనే ఉంటుంది. వెంకటమ్మ కూడా బయట వంటి పని చేయడానికి వెళ్లేది. పెండ్లి వుంది అని ఒక ఆరు నెలలు ఇంట్లోనే ఉంది. తిరిగి ఈ మధ్య కాలంలోనే వంట చేయడానికి వెళుతుంది. అయితే లాస్యను ప్రతి చిన్న విషయానికి టార్చర్‌ ‌చేసేది. ఆమె ఏ పని చేసినా వెంటకమ్మకు నచ్చేది కాదు. వంట చేసినా నచ్చేది కాదు. టీ చేసినా అత్త తాగేది కాదు. ఈ మాత్రం కూడా నీ తల్లి నీకు నేర్పలేదా? అంటూ వంట మొత్తం చెత్త డబ్బాలో వేసేది. మళ్లీ ఆమెనే వండుకొని తినేది. ‘నేను చేసిన వంట తినడం లేదు, నవీన్‌‌ని కూడా తిననీయడం లేదు. అలాంటపుడు ఇంకా నేనెందుకు వంట చేయడం’ అని లాస్య వంట చేయడం మానేసింది. దాంతో ఇంట్లో గొడవలు మరింత పెరిగాయి. లాస్య వాళ్ల బెడ్‌‌రూం డోర్‌ ‌పెట్టుకుంటే ఊరికునేది కాదు. కనీసం ఆమె పడుకున్న తర్వాత పెట్టుకున్నా మెలుకువ వచ్చిన తర్వాత డోర్‌ ‌తీసే వరకు గోల చేసేది.

నవీన్‌‌ని పిలిచి ‘నా కాళ్లు నొప్పిగా ఉన్నాయి నొక్కు’ అనేది. లాస్య నొక్కుతానంటే వద్దనేది. లాస్యను నవీన్‌‌తో అస్సలు మాట్లాడనిచ్చేది కాదు. కనీసం భర్త బండిపైన కూడా కూర్చోనిచ్చేది కాదు. పెండ్లయి ఏడాది అవుతున్నా నవీన్‌‌తో కలిసి కేవలం ఆరు నెలలు మాత్రమే ఉంది. గత ఆరు నెలల నుండి లాస్య పుట్టింట్లోనే ఉంటుంది. అయినా ఇంత వరకు నవీన్‌ ఆమెను తీసుకెళ్లలేదు. ఇలాంటి పరిస్థితుల్లో లాస్య ఐద్వా అదాలత్‌‌కు వచ్చి ‘నవీన్‌‌కు నేను అవసరం లేదు. వాళ్ల అమ్మ ఉంటే చాలు. అతని ముందే వాళ్ల అమ్మ నన్ను తిట్టినా ఒక్క మాట కూడా మాట్లాడడు. ప్రతి విషయానికి నన్నే సర్దుకుపొమ్మంటాడు. కానీ ఆమె మాటలు మనసుకు చాలా కష్టంగా ఉంటాయి. అవి వింటే ఆ క్ష‍ణంలోనే చచ్చిపోవాలన్నంత బాధ కలుగుతుంది. అలాంటి కొన్ని మాటలు రికార్డు చేశాను. మీరే వినండి’ అంటూ వినిపించింది. తల్లితో పాటు నవీన్‌ ‌కూడా అలాగే బూతులు మాట్లాడుతున్నాడు. అటువంటి వాళ్లతో కలిసి ఉండటం కంటే చచ్చిపోవడం మంచిదనిపిస్తుంది. మీరే నాకు న్యాయం చేయండి’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అంతా విన్న తర్వాత మేము నవీన్‌‌కు, వెంకటమ్మకు లెటర్‌ ‌రాసి పంపించాము. వారు వచ్చి చెప్పింది ఏమిటంటే.. ‘మా అమ్మ తిడుతుంది, తన స్వభావమే అంత. ఆమె కంటే నన్నే ఎక్కువగా తిడుతుంది. సరేలే అనుకుంటే సరిపోతుంది. లాస్యను తిడితే నేను ఊరుకోను. మా అమ్మను కోప్పడతాను. ఇంకా లాస్యకు ఏం కావాలి. ఇప్పటికైనా లాస్య వస్తానంటే నేను తీసుకెళతాను. నేను వాళ్ల ఇంటికి వెళితే పంపిస్తామంటున్నారు కానీ పంపడం లేదు.

మళ్లీ ఇక్కడకు వచ్చి పంచాయితీ పెట్టింది’ అన్నాడు. వెంకటమ్మతో మాట్లాడితే ‘లాస్యకు ఒక్క పని చేయడం కూడా రాదు. కనీసం టీ పెట్టడం కూడా రాదు. అది కూడా నేనే చేసుకొని తాగాలి. వంట అయితే చెప్పనక్కర్లేదు. అంత చెండాలంగా చేస్తుంది. దానమ్మ ఒక్క పని కూడా నేర్పించలేదు. అలాంటి దాన్ని తిట్టకుండా ముద్దు పెట్టుకోవాలా?’ అంది. దానికి మేము ‘ఇంటి పని వంట పనికి అయితే ఒక అమ్మాయిని పెట్టుకుంటే సరిపోతుంది. దాని కోసం కోడలు ఎందుకు మీకు. కొడుకుని కోడలిని అస్సలు మాట్లాడుకోనివ్వరు. సరదాగా ఉండనివ్వరు. ఇదేం పద్దతి’ అంటే…
‘అసలు ఆమె నా కొడుకుతో ఎందుకు మాట్లాడాలి. బండి ఎక్కి తిరగాలని ఆమెకు సోకు. అందుకే నేను ఎక్కనివ్వను. ఏది ఏమైనా ఇంట్లో నేను చెప్పినట్టు వింటేనే నాతో పాటు నా ఇంట్లో ఉండాలి. లేకపోతే వాళ్లిద్దరినీ వేరుగా ఉండమని చెప్పండి. వాళ్ల అవసరం నాకు లేదు. ఏడాది లోపు ఒక బిడ్డను కని నాకు ఇవ్వాలి’ అంది. ‘వారిద్దరినీ కనీసం మాట్లాడుకోనివ్వడం లేదు ఇక పిల్లలు ఎలా పుడతారు’ అని అడిగితే మాట దాటేసింది.

నవీన్‌‌తో ‘ఓ భర్తగా మీరు భార్య ఏం చెబుతుందో వినాలి. అలాగే తల్లి చెప్పింది కూడా వినాలి. ఇద్దరికీ సర్ది చెప్పాలి. అంతేకానీ ఆమె చెప్పగానే ఈమెను తిట్టడం ఈమె చెప్పగానే ఆమెను తిట్టడం సరైన పద్దతి కాదు’ అన్నాము. అలాగే వెంకటమ్మతో ‘మీరు లాస్యకు కొంచెం సమయం ఇవ్వాలి. అంత దారుణంగా తిట్టడం అస్సలు కరెక్టు కాదు. పనులు నేర్చుకుంటుంది. ఆమెకు మీరు సాయం చేయండి. భార్యాభర్తలను సంతోషంగా ఉండనివ్వండి. లేదంటే మీ కొడుకు జీవితం మీరే పాడు చేసిన వాళ్లు అవుతారు. ఒక్కసారి ఆలోచించుకోండి. కొడుకు జీవితం నాశనం చేస్తారో లేదా బాగు చేస్తారో మీ చేతుల్లోనే ఉంది. లేదంటే ఇద్దరితో వేరు కాపురం పెట్టిస్తాం. ఏదైనా మీమీదనే ఆధారపడి ఉంది. లాస్య అన్నీ నేర్చుకుంటాను, పనులు చేస్తాను అంటుంది. అలాంటి అమ్మాయిని అర్థం చేసుకొని పనులు నేర్పండి. అంతేకానీ ఇలా పెత్తనం చూపడం సరైనది కాదు. ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి. మళ్లీ వారం తర్వాత రండి ఏం చేయాలో నిర్ణయించుకుందాం’ అని చెప్పి పంపించాము.

అతని ముందే వాళ్ల అమ్మ నన్ను తిట్టినా ఒక్క మాట కూడా మాట్లాడడు. ప్రతి విషయానికి నన్నే సర్దుకుపొమ్మంటాడు. కానీ ఆమె మాటలు మనసుకు చాలా కష్టంగా ఉంటాయి. అవి వింటే ఆ క్ష‍ణంలోనే చచ్చిపోవాలన్నంత బాధ కలుగుతుంది.
లాస్యను ప్రతి చిన్న విషయానికి టార్చర్‌ ‌చేసేది. ఆమె ఏ పని చేసినా వెంటకమ్మకు నచ్చేది కాదు. వంట చేసినా నచ్చేది కాదు. టీ చేసినా అత్త తాగేది కాదు. ‘ఈ మాత్రం కూడా నీ తల్లి నీకు నేర్పలేదా?’ అంటూ వంట మొత్తం చెత్త డబ్బాలో వేసేది. మళ్లీ ఆమెనే వండుకొని తినేది.

సన్‌స్క్రీన్ తో ప్రయోజనాలు
సన్ స్కీన్ వల్ల ఎండ వల్ల చర్మం ఎర్రబడటం, మంట పుట్టడ, పొట్టు ఊడటం వంటి సమస్యల్ని తగ్గించడంలో సన్‌స్క్రీన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల చర్మం త్వరగా ముడతలు పడుతుంది. అయితే, సన్‌స్క్రీన్ వాడటం వల్ల ఈ సమస్యను నివారిస్తుంది. ఎక్కువకాలం పాటు వడ దెబ్బ లేదా ఎండ దెబ్బ తగిలితే స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి సన్‌స్క్రీన్ ఉత్తమ మార్గం. అంతేకాదు చర్మం నల్లబడకుండా, మచ్చలు పడకుండా సమానమైన రంగులో ఉంచడానికి సన్‌స్క్రీన్ సాయపడుతుంది.
సరైన సన్‌స్క్రీన్‌ను ఎలా ఎంచుకోవాలి? అయితే, అన్ని సన్‌స్క్రీన్‌లు ఒకేలా ఉండవు. అందుకే కొనేటప్పుడు రెండు విషయాల్ని గమనించాలని డాక్టర్ చెబుతున్నారు. ​బ్రాడ్ స్పెక్ట్రమ్ : ఇది UVA అంటే ముడతలు కారణమయ్యే కిరణాలు, UVB అంటే సన్‌బర్న్‌కి కారణమయ్యే కిరణాల నుంచి రక్షిస్తుంది. SPF 30 లేదా అంతకంటే ఎక్కువ: కనీసం SPF 30 ఉన్న దానిని వాడటం వల్ల దాదాపు 97% కిరణాలను అడ్డుకోవచ్చు.

చర్మ రకాన్ని బట్టి ఎంచుకోండి
సన్‌స్క్రీన్ రాసుకున్నప్పుడు ముఖం జిడ్డుగా లేదా మరీ తెల్లగా కనిపించకుండా ఉండాలంటే స్కిన్ టైప్‌కి తగ్గట్టుగా కొనాలి.
జిడ్డు చర్మం : ఇలాంటి చర్మ రకం ఉన్నవారు ‘జెల్ బేస్డ్’ లేదా ‘Matte finish’ ఉన్న సన్‌స్క్రీన్‌ల్ని ఎంచుకోవాలి. ఇవ చర్మంపై జిడ్డును పెంచదు.
పొడి చర్మం : పొడి చర్మంతో బాధపడేవారు ‘క్రీమ్ బేస్డ్’ లేదా మాయిశ్చరైజర్ కలిగిన సన్‌స్క్రీన్‌ వాడాలి. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
సున్నితమైన చర్మం : ఈ చర్మ తత్వం ఉన్నవారు కెమికల్స్ తక్కువగా ఉన్న ‘మినరల్ సన్‌స్క్రీన్’ అంటే జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ ఉన్నవి వాడటం మంచిది.
వాడే విధానం (ఎలా వాడాలి?)
సమయం: ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి కనీసం 20 నిమిషాల ముందే సన్‌స్క్రీన్ రాసుకోవాలి. అప్పుడే అది చర్మంలోకి ప్రవేశించి రక్షణనిస్తుంది.
పరిమాణం: కేవలం ముఖానికే కాకుండా మెడ, చేతులు, పాదాలు ఇలా ఎండ తగిలే ప్రతి శరీర భాగంపై అప్లై చేసుకోవాలి.
మళ్లీ రాయడం: ఒక్కసారి రాస్తే రోజంతా ఇది పనిచేయదు. ప్రతి 2 నుంచి మూడు గంటలకు ఒకసారి మళ్లీ రాసుకోవాలి. ఎక్కువగా చెమట పడుతున్నా లేదా స్విమ్మింగ్ చేస్తున్నా ఇంకా త్వరగా రాసుకోవాలి.

– వై వరలక్ష్మి, 9948794051

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -