Saturday, May 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు 

నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు 

- Advertisement -

మంజూరైన లబ్ధిదారులు అందరూ ప్రారంభించాలి 
అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
నవతెలంగాణ-మిడ్జిల్ 

అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే ప్రారంభించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ చెప్పారు. శనివారం మండలంలోని లింబ్య తండాలో స ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతినీ పరిశీలించారు.  ప్రతి పేదవాడు ప్రభుత్వ సహాయంతో సొంత ఇంటిని నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించని కొంత మంది లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వారితో మాట్లాడారు.

ప్రభుత్వం ఇల్లు లేని పేద కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించి ఇళ్లు కట్టుకునేందుకు మంచి అవకాశం కల్పించిందని, ప్రతి లబ్ధిదారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముగ్గు పోసుకుని వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఆయన సూచనలకు స్పందించిన గ్రామస్తులు తక్షణమే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఐకేపీ ద్వారా రుణ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మండల ఏపీఎంలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మంజూరైన ప్రతి ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు మరియు మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

 మండల స్థాయి హౌసింగ్ ఇంజనీర్లు నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎటువంటి లోపాలు లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులకు తెలిపారు. అనంతరం తండాలో డ్రైనేజీ పారిశుద్ధ పనులను పరిశీలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -