Saturday, May 9, 2026
E-PAPER
Homeనల్లగొండప్రధాని చేతుల మీదుగా రూ.7 వేల 800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం 

ప్రధాని చేతుల మీదుగా రూ.7 వేల 800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం 

- Advertisement -

 నవతెలంగాణ- ఆలేరు టౌను 
ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ చేతుల మీదుగా రూ.7800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నట్లు, బిజెపి యువ నాయకులు బిర్కూరి ప్రదీప్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా అనేక అభివృద్ధి ప్రాజెక్టులను, కోట్ల విలువైనవి ప్రజలకు అంకితం చేస్తారని, అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారని పేర్కొన్నారు. ఈ సందర్శన కేవలం అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం మాత్రమే కాదని, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువైన రూపొందించే ప్రణాళికాలు ఉన్నాయని చెప్పారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించాలనే దృఢ సంకల్పంతో కూడిన ముఖ్యమైన అడుగని, మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నట్లు, తెలంగాణ కూడా వేగంగా ముందుకు సాగాలనేది  లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

 హైదరాబాదు పెరేడ్ గ్రౌండ్ లో సాయంత్రం 4 గంటలకు జరుగు, ప్రధాని మోడీ బహిరంగ సభను తెలంగాణ ప్రజలందరూ, బీజేపీ కార్యకర్తలు, స్వయం సేవకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ చారిత్రక సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -