- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కా. టి. జ్యోతి
నవతెలంగాణ – హైదరాబాద్
పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, కార్మికోద్యమ నాయకురాలు కామ్రేడ్ నూర్జహన్ జీవితం స్ఫూర్తిదాయకమని, ఆమె మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు టి.జ్యోతి, జిల్లా కార్యదర్శి ఎమ్ డీ జాహింగీర్ లు అన్నారు. శనివారం పల్లెర్ల గ్రామంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర మాజీ అధ్యక్షులు వేముల ఆనంద్ జీవిత సహచరి కామ్రేడ్ నూర్జహాన్ సంతాప సభ సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు వంటిపెంటి గోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. త్యాగం, ఆశయం, ప్రజలపై అచంచలమైన విశ్వాసంతో ఉద్యమాల్లో సమరశీలంగా ముందు వరుసలో నిలబడిన ధీర వనిత అని, ఆమె లేని లోటు పుడ్చలేనిది అని అన్నారు.
ఈ సంతాప సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు, పెద్ది వెంకట్రాములు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్టా నర్సింహా, జక్కిడి నర్సింహా రెడ్డి, ఈర్లపల్లి ముత్యాలు, నాగటి మారన్న, ప్రజా వాగ్గేయకారులు చింతల యాదగిరి, కాకం అంజన్న, పాటల వెంకన్న, చంద్రమౌళి,అమరావతి శివ, రాము, కామ్రేడ్ నూర్జహన్ పై నివాళి గీతాలు ఆలపించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గూడూరు అంజిరెడ్డి, సంగు నరేందర్, గడ్డం వెంకటేష్, మండల నాయకులు వేముల భిక్షం, గోవర్ధన్, నాగయ్య బుగ్గయ్య, యాదిరెడ్డి, రాంరెడ్డి, హమీద్, స్వామి,సదానంద్, దయానంద్, కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.



