వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జి.ఎస్.ఆర్.
నవతెలంగాణ-శాయంపేట
అకాల వర్షాల వల్ల ధాన్యం తడిస్తే ఆ ధాన్యాన్ని కొంటామని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు. శనివారం ఆయన నేరేడుపల్లి ప్రగతి సింగారం కాట్రపల్లి వసంతపూర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 40 కిలోల 650 గ్రాములు మాత్రమే కాంటాలు పెట్టాలని తెలిపారు. తేమ 17 శాతం ఉండేటట్లు చూసుకోవాలని రైతులకు సూచించారు. కోత మిషన్ ఆర్ పి ఎం 18 నుండి20 బి 2 నెంబర్ పెడితే తాలు రాదని తెలిపారు. రైతులు గమనించాలని కోరారు. ఎక్కడైనా దోపిడీ జరిగితే డి సి ఓ, డి ఆర్ డి ఓ కలెక్టర్ లు బాధ్యత వహించవలసి వస్తుందని అన్నారు.
కఠిన చర్యలకు వెనుకాడబోమని అన్నారు. మండలంలో 59 లక్షల టన్నుల మక్కలు పండినట్లు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలో లక్ష 18 వేల టన్నుల మక్కలు పండినట్లు తెలిపారు. మక్కలను నిల్వ చేయడానికి సరియైన గోదాములు లేవు కాబట్టి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఆఫీసులలో నిలువ చేసుకోవాల్సిందిగా సూచించారు. మక్కలకు 5,800 కోట్లు, సన్నబియ్యానికి 14 వేల కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు 21 కోట్లు అప్పు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ ఎంపీడీవో ఫణీంద్ర ఏవో ప్రియదర్శిని ఏపిఎం వేణుగోపాల్, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్,ఏఎంసి వైస్ చైర్మన్ రవీందర్, నాయకులు బుచ్చిరెడ్డి చక్రపాణి రఘుపతి రెడ్డి, గోపాల్ మహేందర్ సర్పంచులు ఇందిరా భాస్కర్ సదర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.



