Wednesday, May 13, 2026
E-PAPER
Homeజిల్లాలుహైద‌రాబాద్‌కు చేరుకున్న పీఎం మోడీ

హైద‌రాబాద్‌కు చేరుకున్న పీఎం మోడీ

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: తెలంగాణ‌ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పీఎం మోడీ హైద‌రాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌, సీఎం రేవంత్‌రెడ్డి తో పాటు పార్టీశ్రేణులు స్వాగ‌తం ప‌లికారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో హైటెక్‌ సిటీకి వెళ్తారు. 3.45గంటలకు సాయి సింధు క్యాన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 6.45 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి గుజరాత్‌లోని జామ్‌ నగర్‌కు తిరిగి వెళ్తారు.

అభివృద్ధి కార్యక్రమాలు
-రూ.3,175 కోట్లతో చేపట్టనున్న (గూడెబెల్లూర్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు) జాతీయ రహదారి-167కు శంకుస్థాపన చేస్తారు
-రూ.2,350 కోట్లతో 3,245 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న జహీరాబాద్‌ పారిశ్రామిక ప్రాంతానికి శంకుస్థాపన చేస్తారు
-రూ.1,700 కోట్లతో ఏర్పాటు చేసిన వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్రారంభోత్సవం చేస్తారు.
-రూ. 1,535 కోట్ల విలువైన కాజిపేట-విజయవాడ మల్టి ట్రాకింగ్‌తో పాటు పలు కీలక రైల్వే ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తారు.
-రూ.600 కోట్లతో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అభివద్ధి చేసిన మల్కాపూర్‌ టెర్మినల్‌ను జాతికి అంకితం చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -