నవతెలంగాణ-హైదరాబాద్: సికింద్రాబాద్ చిలకలగూడ ప్రాంతంలో రెండు రోజుల క్రితం యావన్ అనే యువకుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితా మూర్తి వెల్లడించారు. ఈనెల 7వ తేదీన సికింద్రాబాద్ చిలకలగూడ పీఎస్ ప్రాంతంలో జరిగిన యావన్ హత్య కేసులో 10 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం. కేసు విచారణ కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేసులో సాయి కిరణ్ మొదటి నిందితుడు. అతడే యావన్ హత్యకు ప్లాన్ చేశాడు. అరెస్టైన వారిలో యువతి తండ్రి నరసింహ యాదవ్, బాబాయ్‌లు మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్ ఉన్నారు. వీరితో పాటు అమ్మాయి బ్రదర్ పరమేష్ , అలానే ఓ మైనర్ కూడా ఉన్నాడు’ అని డీసీపీ రక్షితా మూర్తి తెలిపారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు ద్విచక్ర వాహనం మొబైల్ ఫోన్లు సీజ్ చేశాం. నిందితులకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించాం. అందులో రాహుల్, శివలకు గంజాయి పాజిటివ్ వచ్చింది’ అని డీసీపీ రక్షితా మూర్తి తెలిపారు.
యావన్ హత్య కేసు..డీసీపీ రక్షితా మూర్తి వివరాలు వెల్లడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



