నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన మేనం ప్రణవి ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పది వార్షిక ఫలితాలలో 564 మార్కులు సాధించి పాఠశాల, మండల, భూపాలపల్లి జిల్లా టాపర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే సోమవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతి కళాక్షేత్రంలో బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని 612 మండలాలకు సంబంధించి మండల టాపర్స్ ను ప్రధానోపాధ్యాయులకు ప్రతిభా పురస్కార్ అవార్డ్ తో సత్కరించారు. ఈ నేపథ్యంలో తాడిచెర్ల విద్యార్థిని ప్రణవి, ప్రాధానోపాధ్యాయుడు తిరుపతి ప్రతిభా పురస్కార్ లను విహెచ్, మల్లు రవి, ఆర్. కృష్ణయ్య అందజేసి ప్రణవినీ ప్రధానోపాధ్యాయుడు తిరుపతి అభినందించి సన్మానించారు.
మేనం ప్రణవికి ప్రతిభా పురస్కార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



