- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన,ప్రగతి ప్రణాళికల కార్యక్రమంలో భాగంగా ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ శ్రీమతి అభిలాష అభినవ్ ఆదేశాలతో,తాడిచర్ల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి విజయ దేవి సూచన మేరకు సోమవారం కళాశాలలో విద్య వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూలు,మెరుపు కాగితాలతో, పచ్చని తోరణాలతో చక్కగా అలంకరించిన ఒక పండుగ వాతావరణంలో ఘనంగా ప్రారంభించారు. ఏడు రోజులకు సంబంధించిన కార్యక్రమంలో భాగంగా మొదటి ప్రారంభ రోజు పోస్టర్లు,బ్రోచర్లు కళాశాల సాధించిన ప్రగతి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు,అధ్యాపకేతర సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



