- Advertisement -
పెద్దతూండ్ల సర్పంచ్ బండారి నర్సింగం
నవతెలంగాణ – మల్హర్ రావు
జాబ్ కార్డున్న ప్రతి కూలి ఉపాధిహామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండలంలోని పెద్దతూండ్ల సర్పంచ్ బండారి నర్సింగం సూచించారు. సోమవారం గ్రామంలోని పెద్దచెరువులో ఉపాధిహామీ పనులు ప్రారబించారు. జాబ్ కార్డున్న ప్రతి వంద రోజులు ఉపాది పని పూర్తి చేయాలన్నారు. రోజుకు కూలికి రూ.270 వస్తుందని తెలిపారు. ఈ లెక్కన ఈ వేసవిలో వ్యవసాయ పనులు ప్రారంభం నాటికి రూ.27వేలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్, పంచాయతీ కార్యదర్శి పెంచాల సతీష్, వార్డు సభ్యులు జంబోజు సంధ్యారాణి-రవిందర్, బియ్యని రాజమొగిలి, కేశవ్, ఉపాది సిబ్బంది, కూలీలు పాల్గొన్నారు.
- Advertisement -



