సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్
నవతెలంగాణ – ముధోల్
1-19 ఏండ్ల గల పిల్లలకు అల్పెండజోల్ మాత్రలు తప్పని సారిగా వేయించాలని సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ అన్నారు. సోమవారం నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు సర్పంచ్ ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు. ఎదుగుతున్న చిన్నారులకు ఈ మాత్రలుఎంతోఉపయోగపడతాయనిఅన్నారు. పేగు పురుగుల నివారణకు ఆల్బెండజోల్ ఎంతో అవసరమన్నారు. తమ పిల్లలకు తల్లిదండ్రులు ఆల్బెండజోల్ ఖచ్చితంగా వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం గంగామణి, అంగన్వాడీ టీచర్లు దమయంతి, సంగీత, ఆయా సుజాత, ఆశ వర్కర్స్ లలిత, సుగుణ, కవిత , తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



