Tuesday, May 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి పని ప్రదేశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

ఉపాధి పని ప్రదేశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వేసవి ఎండలు అధికంగా ఉన్నందున ఉపాధి పని ప్రదేశంలో కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పల్లె చెరువులో కొనసాగుతున్న పూడికతీత పనులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మస్టర్ రోల్ లో కూలీల హాజరు తీసుకున్నారు.పని ప్రదేశంలో కూలీలకు కల్పిస్తున్న మౌళిక వసతులపై ఫీల్డ్ అసిస్టెంట్ ను ఆరా తీసి, పలు సూచనలు చేశారు. ఉపాధి హామీ పనులకు కూలీలు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా చూడాలని సూచించారు. 115 మంది కూలీలు పనికి హాజరవ్వాల్సి ఉండగా 111 మంది కూలీలు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎంపీడీవో కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో నీడ సౌకర్యంతో పాటు త్రాగునీటినీ, ఓఆర్ఎస్  ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఈజీఎస్  సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీ రమ, మేట్లు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -