నవతెలంగాణ-హైదరాబాద్: CBSE 12వ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. పరీక్షా ఫలితాల్లో బాలురతో పోలిస్తే బాలికలు పైచేయి సాధించారు. బాలురతో పోలిస్తే బాలికలు ఫలితాల్లో 6.73శాతంతో తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. బాలికలు 88.86శాతం ఉత్తీర్ణత శాతాన్ని సాధించగా, బాలురు 82.13శాతం ఉత్తీర్ణ సాధించారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం మూడుశాతం తగ్గింది. తిరువనంతపురం 95.62శాతంతో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేయగా, ప్రయాగ్ రాజ్ 72.43శాతంతో అత్యల్ప శాతాన్ని నమోదు చేసింది.
2026 విద్యా సంవత్సరంలో మొత్తం 17,68,968మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, ఉత్తీర్ణత శాతం 88.39శాతం నుండి 85.20శాతానికి పడిపోయింది. 1,63,000మందికి పైగా విద్యార్థులు కంపార్ట్ మెంట్ కేటగిరీలో స్థానం పొందారు. గతేడాదితో పోలిస్తే సుమారు 2శాతం పెరుగుదల నమోదైంది. 94,000మందికి పైగా విద్యార్థులు 90శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించగా, 17,000మందికి పైగా విద్యార్థులు 95శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించారు.



