నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండలంలోని బుద్ధ సముద్రం గ్రామంలో బుధవారం షెఫర్డ్ మినిస్ట్రీస్ సిఎఫ్ సిఎం పాస్టర్ జిఎన్ దాస్ వారి ఆధ్వర్యంలో హాండ్స్ ఆఫ్ హోప్ సంస్థ వారు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో కంటి సమస్యలు పంటి సమస్యలు అలాగే షుగర్ బిపి రక్త పరీక్షలు నిర్వహించారు అవసరమున్నవారికి ఈసీజీ ఎక్స్ రే తీశారు. ఈ వైద్య శిబిరంలో బుద్ధ సముద్రం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దాదాపుగా 360గా పైగా వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు అలాగే అవసరం ఉన్నవారికి కంటి అద్దాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామాంజినేయులు, షఫర్డ్ మినిస్ట్రీస్ పాస్టర్ జిఎన్ దాస్ వైద్యులు సురేష్, రితీష్, హేమ జయరాజ్, సుష్మ, ఐజాక్, సుభాష్, ఉన్నారు.
విజయవంతమైన వైద్య శిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



