Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళితులను కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించడం అమానుషం 

దళితులను కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించడం అమానుషం 

- Advertisement -

– డి బిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్. 
నవతెలంగాణ – మిరుదొడ్డి 
: ఆధునిక యుగంలో సైతం దళితులను కులం పేరుతో దూషిస్తూ దాడికి ప్రయత్నించడం అమానుషమని దళిత బహుజన ఫ్రంట్  జాతీయ కార్యదర్శి పి శంకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండలం పోతా రెడ్డి  గ్రామంలో దళితులను కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించిన సంఘటనపై గురువారం నాడు బాధితులను, గ్రామస్తులను కలిసి సంఘటన వివరాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డి బిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన దళితులైన యాదగిరి, బాలరాజ్ , కుమ్మరి సత్తయ్య లు న స్కల్ పాత రోడ్ లో తమ ఎడ్లబండలో ఇసుకను తెచ్చుకుంటున్న సందర్భంలో గ్రామానికి చెందిన బండి మురళి గౌడ్, నర్సాగౌడ్ లు అడ్డుకొని మీ ఎడ్ల బండ్లు ఈ రోడ్డు నుండి పోవద్దని జాతి పేరుతో అసభ్యకరంగా దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. సమాజము  అభివృద్ధి వైపు ఎందుకు పోతున్నప్పటికీ దళితుల పట్ల కుల వివక్ష అంటరానితనం అణిచివేత పాల్పడడం మారడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

దళితులను కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. గ్రామంలో తహసిల్దార్ ఎస్సై నెల చివరి ఆకరణ పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి కుల వివక్ష , ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం పై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి బిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుబాయ్ సంజు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భీమ్ శేఖర్ , గ్రామ నాయకులు చంద్రసాగర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -