Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్షయ రహిత సమాజం కోసం కృషి చేద్దాం: హెచ్ ఈ ఓ రవికుమార్

క్షయ రహిత సమాజం కోసం కృషి చేద్దాం: హెచ్ ఈ ఓ రవికుమార్

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి : క్షయ రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని,ప్రభుత్వ లక్ష్యాన్ని వంద శాతం సఫలం చేయాలని, హెచ్ఈఓ రవికుమార్ అన్నారు. ఆయుష్ ఆరోగ్య శివిర్-2 కార్యక్రమంలో భాగంగా గురువారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో స్థానిక సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఉచిత ఎక్స్రే క్యాంప్ ఏర్పాటు చేసి మాట్లాడారు.టీబీ (క్షయ) రహిత సమాజ స్థాపనే  లక్ష్యంగా, ప్రభుత్వం, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఊరూరా ఉచిత ఎక్స్-రే క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని, ఈ క్యాంపుల ప్రధాన ఉద్దేశ్యం,వ్యాధి లక్షణాలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడం అన్నారు.సమాజంలో ముందుగా క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి సకాలంలో చికిత్సలు మొదలుపెడితే వ్యాధి నయం అవుతుందని అన్నారు.

టీబీ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమకు సమీపంలో జరిగే ఈ ఉచిత క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని,టీబీ 100 శాతం నయమయ్యే వ్యాధి,కాబట్టి భయపడకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అన్నారం గ్రామంలో మొత్తం 85 మందికి ఎక్స్రే తీసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు బైరు చిరంజీవి, బల్లెం ప్రవీణ్, డాక్టర్ బైన రమ్య, డాక్టర్ భూమిక, ఏఎన్ఎంలు రజిత, నాగలక్ష్మి,టీబీ నోడల్ అధికారి లకావత్ యాదగిరి, టిబి ఎక్స్రే టెక్నీషియన్ బడుగు ప్రసాద్, మాధవరెడ్డి, ఆశా కార్యకర్తలు మేరమ్మ, రమ, పద్మ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -