– తనిఖీ చేసిన ఎసిపి బి ప్రకాష్ యాదవ్..
నవతెలంగాణ – డిచ్ పల్లి : రాబోయే బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకుని పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇందల్ వాయి టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను నిజామాబాదు ఏసీపీ బి ప్రకాష్ యాదవ్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా పశువులను రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. పశువులను రవాణా చేసే వ్యక్తులు తప్పనిసరిగా సరైన పత్రాలు వెంట తీసుకురావాలని, వాటి లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెక్‌పోస్టుల వద్ద పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిచ్‌పల్లి సీఐ కె వినోద్ , ఇందల్ వాయి ఎస్ హెచ్ ఓ జీ సందీప్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
టోల్ ప్లాజా వద్ద విసృతంగా వాహనాల తనిఖీలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



