- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
వెనుకబడిన తరగతుల బీసీ సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ కమిటీలో, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేతఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సభ్యుడుగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో టిఆర్పి ఆలేరు నాయకులు మల్లన్నను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పిట్టల శంకర్ ఆలేరు పట్టణ, మండల అధ్యక్షులు చింతపండు వెంకటేష్, చెక్కరవి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



