ఆటుపోట్లను అధిగమించటం కమ్యూనిస్టులకు కొత్తకాదు..
దోపిడీ ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుంది ప్రపంచంలో వేగంగా సంభవిస్తున్న మార్పులు
ప్రారంభోపన్యాసంలో కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభ్రదం
సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణా తరగతులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మార్క్సిస్టు సిద్ధాంతం అజేయమైందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం రాజకీయ శిక్షణా తరగతులను ప్రారంభించారు. మూడురోజులపాటు నిర్వహించే ఈ తరగతుల ప్రారంభ సూచకంగా పార్టీ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి జెండాను ఆవిష్కరించారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ ప్రస్తుతం కమ్యూనిస్టులు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఉద్యమాలు బాగా బలహీనపడ్డాయన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కమ్యూనిస్టుల అవసరం ఎంతగానో ఉందని చెప్పారు. చరిత్రలో కమ్యూనిస్టులు అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారని తెలిపారు. గతాన్ని విశ్లేషించి, వర్తమానాన్ని అర్థం చేసుకుని, భవిష్యత్తును మార్క్స్ అంచనా వేయగలిగాడని వివరించారు . ప్రకృతి, మానవ సమాజమూ నిరంతరం అభివృద్ధి దిశగా మార్పు చెందుతున్నట్టే అందులో భాగమైన మార్కిజం కూడా అభివృద్ధి చెందాల్సి ఉంటుందని చెప్పారు. నూతన అంశాలను ఇముడ్చుకోవటం ద్వారా మార్క్స్ కాంలోనూ మార్క్సిజం అభివద్ధి చెందటం జరిగిందని తెపారు.
లెనిన్ కాంలో అది మరింతగా ముందుకు సాగిందనన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ కవ¶్యనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు, ఆటంకాలను పరిశీంచ్సా ఉంటుందని గుర్తు చేశారు . ప్రపంచ శ్రామికోద్యమ చరిత్రంతా పరిశీస్తే అనేక సందర్భాలలో ఉద్యమం దారుణంగా దెబ్బతినటం, తిరిగి పుంజుకోవటం, రెట్టింపు బంతో ముందుకు సాగటం గమనించాలని గుర్తు చేశారు. ఆ ఎత్తు పల్లాలను పరిశీంచి అర్థం చేసుకోవాలని సూచించారు. మార్క్స్, ఎంగెల్స్ కంటే ముందు కూడా కార్మికోద్యమం ఉందన్నారు . ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం తర్వాత కార్మికవర్గం పెరిగిందన్నారు. యంత్రాలు రావటం వల్ల తాము పని కోల్పోతున్నామనీ, యంత్రాలను ధ్వంసం చేసే ఉద్యమం మొదలుకుని సెయింట్ సైమన్, రాబర్ట్ ఓవెన్, ఫోరియర్ వగైరా ఊహాజనిత సోషస్టుల ప్రయోగాల వరకూ శ్రామికుల స్థితి మెరుగుదలకు అనేక విధాలా కషి జరిగిందన్నారు. అయినా శాస్రీయమైన సిద్ధాంతం లేకపోవటం వల్ల కార్మికోద్యమం అనేక వైఫల్యాలకు గురైందని తెపారు. విస్తరణకు కూడా ఆటంకాలేర్పడ్డాయని చెప్పారు.
ఈ ఆటంకాల నుండే కార్మికవర్గ విముక్తికి విప్లవ సిద్ధాంతం అవసరమేర్పడిందని తెపారు . ఈ అవసరం నుండే 1948లో మార్క్, ఎంగెల్స్‌లు ఉమ్మడిగా రచించిన ‘కవ¶్యనిస్టు ప్రణాళిక’ కార్మిక వర్గానికి సిద్ధాంత ఆయుధంగా అందించబడిందన్నారు. శాస్త్రీయ సిద్ధాంతం ఆవిర్భవించాక అనేక ప్రాంతాలకు, దేశాలకు కార్మికోద్యమం వ్యాప్తి చెందిందని తెపారు. ఫ్రాన్స్, జర్మనీ, బ్జెయం ఇంకా అనేక యూరప్ దేశాలకూ ఈ ఉద్యమం విస్తరించిందన్నారు. అంతర్జాతీయ సంస్థ ఏర్పాటుతో మరిన్ని దేశాలకు విస్తరించిందని గుర్తు చేశారు. ఉద్యమం ఎంత బంగా తయారైందంటే ఫ్రాన్స్ దేశంలోని ‘పారిస్’ నగరంలో విప్లవం ద్వారా మొదటి ‘కార్మిక రాజ్యం’ ఏర్పడిందన్నారు. అయితే ఈ ప్రభుత్వం డెబ్బయి రోజులు మాత్రమే నిలవగగిందని తెపారు. పెట్టుబడిదారీ వర్గం ఈ ఉద్యమాన్ని క్రూరంగా అణచివేసిందని చెప్పారు. పారిస్‌లో 30వేల మందిని ఉరి తీశారనీ, ఇంకా అనేక దేశాల్లో వేలాది కార్మిక నాయకులను నిర్దాక్షిణ్యంగా చంపివేశారని వివరించారు . మార్క్స్ ఈ వైఫల్యం నుంచి విలువైన గుణపాఠాలు తీశారని తెపారు.
పారిస్ విప్లవంలో రాజ్యాంగ యంత్రాన్ని నాశనం చేయకపోవటం, బ్యాంకులు జాతీయం చేయకపోవటం, ఉద్యమం కార్మికవర్గానికే పరిమితం కావటం వల్ల ఏర్పడిన రైతాంగ వ్యతిరేకత వీటన్నిటికంటే ముఖ్యంగా కార్మికులకు ఒక ‘రాజకీయ పార్టీ’ లేకపోవటం ముఖ్యమైన బలహీనతగా గుర్తించారన్నారు. ఈ ఆటంకాల నుండి బయటపడటానికి చాలా కాం పట్టినా క్రమంగా ఉద్యమం బపడి 1889 నాటికి అనేక దేశాల్లో ‘సోషల్ డెమొక్రటిక్ పార్టీ’ పేరుతో కార్మికుల రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయని చెప్పారు. కమ్యూనిస్టు ఉద్యమాలు ఎదుర్కొన్న అనేక ఆటంకాలు, సైద్ధాంతిక సమస్యలన్నింటినీ అనుభవాల ఆధారంగా మార్క్సిజాన్ని అన్వయించి, అభివద్ధి పర్చటం ద్వారా సోషస్టు రాజ్యాలు, పెట్టుబడిదారీ వ్యవస్థకు దీటుగా సోషస్టు శిరం ఏర్పడ్డాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మన దేశంలో సోషజం ఎలా ఉండాలి అనేది సీపీఐ(ఎం) కొజికోడ్ మహాసభ(2012)లో స్థూంగా నిర్దారించుకున్నదని గుర్తు చేశారు. దానిలో ప్రజాస్వామ్యం, బహుళ పార్టీల రాజకీయ వ్యవస్థ తదితర అంశాల గురించి చెప్పిందని తెపారు. గత అనుభవాలను బట్టి ఉద్యమాలు సరళరేఖలో సాగిపోవనీ, ఈ ఆటుపోట్లు సహజమనీ, ఇంతకంటే పెద్ద ఆటంకాలను, ఊచకోత హత్యాకాండలను కూడా అధిగమించి కమ్యూనిస్టు ఉద్యమం పురోగమించిందని మనకు అర్ధమౌతుందన్నారు.
అందువల్ల నేటి ఆటంకాలు, ఉద్యమ బలహీనతల నుండి గుణపాఠాలు నేర్చుకోవటం, తిరిగి ఉద్యమం ఉవ్వెత్తున మళ్లీ పుంజుకోవటం అనేది అనివార్యమైన పరిణామమని అన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధం కేవం ఆ మూడు దేశాలకేగాక మొత్తం ప్రపంచంపైనా ప్రభావం చూపుతోందన్నారు. ఆర్ధిక, రాజకీయ సంక్షోభాలు ఏర్పడతాయన్నారు. అమెరికా తిరుగులేని ప్రపంచాధిపత్యం బద్దలౌతుందన్నారు. అమెరికా ఆర్ధిక, మిలటరీ శక్తులు ఇప్పటికే బాగా బలహీనపడ్డాయని చెప్పారు. చైనా అధ్వర్యంలో అనేక సామ్రాజ్యవాద వ్యతిరేక దక్షిణాది దేశాలు ఈ సమస్యపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంóంచాయని తెపారు. ఈ క్రమం ఇంకా వేగవంతమై అమెరికా పెత్తనం నశించి బహుళధవ ప్రపంచం ఏర్పడే సూచనలు గోచరిస్తున్నాయని చెప్పారు. కవ¶్యనిస్టు ఉద్యమ పురోభివద్ధికున్న ఈ ముఖ్యమైన ఆటంకం తొలగితే, మిగతా ఆటంకాలు బలహీనమవటం, ఉద్యమాలు తిరిగి ఉత్సాహంగా సాగటం తప్పక జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి సీపీఐ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ అధ్యక్షత వహించగా జూలకంటి రంగారెడ్డి, ఎండి అబ్బాస్, జి నాగయ్య పాల్గొన్నారు
మార్క్సిజం అజేయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



