Saturday, May 16, 2026
E-PAPER
Homeవరంగల్నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీ నిర్వహణ

నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీ నిర్వహణ

- Advertisement -
  • కాలుష్యంతో విలవిల్లాడుతున్న విలాసాగర్ ప్రజలు

నవతెలంగాణ–కాటారం: కాటారం మండలంలోని విలాసాగర్ గ్రామపంచాయతి పరిధిలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర బ్రిక్స్ ఇటుక బట్టీ గ్రామ ప్రజలకు శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఈ ఇటుక బట్టీ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ, దుమ్ము, బూడిద కారణంగా గ్రామంలో తీవ్ర కాలుష్య పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఇటుక బట్టీ నుంచి వచ్చే పొగతో గ్రామం మొత్తం కమ్ముకుపోతుండటంతో శ్వాసకోశ సమస్యలు, కంటి మండింపు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని మహిళలు, వృద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.
ఇటుక బట్టీ నిర్వహణపై ఇప్పటికే గ్రామపంచాయతి అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, నిర్వాహకులు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని సమాచారం.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇటుక బట్టీపై తక్షణ చర్యలు తీసుకోవాలని, కాలుష్య భారిన పడుతున్న తమ గ్రామాన్ని రక్షించాలని విలాసాగర్ ప్రజలు వేడుకుంటున్నారు. లేకపోతే గ్రామస్తులంతా కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -