Friday, May 15, 2026
E-PAPER
Homeనిజామాబాద్బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి

బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ-మోపాల్: మోపాల్ మండలం తానకుర్ద్ గ్రామానికి చెందిన శ్రీ మొహమ్మద్ అంజత్ ఖాన్ బైక్ అదుపు తప్పి మృతి చెందారు. ఎస్ఐ సుష్మ తెలిపిన వివరాల ప్రకారం.. తానకుర్ద్ గ్రామం నుండి నిజామాబాద్ వైపు వెళ్తుండగా, తానకుర్ద్ గ్రామ శివారులో భారత్ పెట్రోల్ బంక్ సమీపంలోని మలుపు వద్ద స్వయంగా ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో అతనికి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.తక్షణమే చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడునీ. మరణించిన వ్యక్తి సోదరుడు జావేద్ ఫిర్యాదు తెలుపుతూ తన సోదరుడి మృతిపై ఎటువంటి అనుమానం లేదని వివరించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి చట్టప్రకారం విచారణ తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -