Saturday, May 16, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిగ్రామీణ ఉపాధి గర్జన

గ్రామీణ ఉపాధి గర్జన

- Advertisement -

దేశంలో రాజ్యాంగబద్దమైన పనిహక్కుకు గుర్తింపునిచ్చింది మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ. నైపుణ్యం లేని గ్రామీణ ప్రజల కోసం వామపక్ష‍ాల ఒత్తిడి మేరకు అప్పటి యూపీఏ-1 హయాంలో శ్రీకారం చుట్టిందే ఈ మహత్తర చట్టం. రెక్కాడితేగాని డొక్కాడని కోట్లాది మంది శ్రమజీవుల పాలిట అన్నపూర్ణగా వెలుగొందిన పథకాన్ని చట్టంగా మార్చి రక్షణ కల్పించారు. ఉన్న ఊళ్లో పని కల్పించాలనేది నిబంధన. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, నీటి పొదుపు, కరువు నివారణ, వరదల నియంత్రణ తదితర పనులను శాశ్వత ప్రాతిపదికన చేయడం ఉపాధి హామీ చట్టం ప్రాథమిక ఉద్దేశ్యం. తొంభై శాతం నిధులను కేంద్రం, పది శాతం రాష్ట్రాలు భరించేలా అప్పట్లోనే తెచ్చారు. చట్టబద్దత కలిగిన ప్రత్యేక పథకమిది. 2005 లో వచ్చిన ఈ చట్టం వంద రోజుల పనికి గ్యారంటీ ఇచ్చింది. తద్వారా గ్రామీణ పేదలకు ఉపాధి లభించి కొనుగోలు శక్తిని పెంచింది. అడ,మగ అనే తేడా లేకుండా సమాన వేతనాలు అందేలా చూసింది. 2008 ఆర్థిక మాంద్యంలోనూ దేశాన్ని గట్టెక్కించింది. ఇది గతం.

కాగా వర్తమానంలో జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని చెరబట్టింది బీజేపీ మోడీ సర్కార్‌. ముందు పనిదినాలు తగ్గించింది. తర్వాత నిధుల కోత విధించింది. క్రమంగా చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ వీబీ జీ రామ్‌జీ పథకంగా మార్చింది. దానికి మతం రంగును పులిమింది. కూలీల మధ్య కుల,మతాల అంతరాలు సృష్టిస్తున్నది. తొలుత ఆధార్ కార్డుకు లింక్‌పెట్టి పేద కూలీలను సతాయించిన కేంద్రసర్కారు, మార్గదర్శకాల పేర మొత్తం పథకానికే ఎసరుపెట్టింది. కాగా చట్టం మౌలిక సూత్రాలను దెబ్బతీస్తూ రకరకాల నిబం ధనల పేర నిధులకు కోతపెడుతూ పేదల కడుపుకొడుతున్నది. చట్టం పేర వచ్చే ప్రయోజనాలను ఉపసంహరించింది. పనిదినాలు పెంచామనే పేరే తప్ప ఏడాదిలో వ్యవసాయ సీజన్‌లో ఉపాధి హామీ పనులకు కోతపెట్టింది. నిధులనూ పరిమితం చేసింది. దీంతో పేదలకు అన్నం పెట్టే పథకం కాస్త నిర్వీర్యం కావడానికి కారణమైంది. గతేడాది తెచ్చిన పథకంలో 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని మెలిక పెట్టింది. అలాగే చేసిన పనికి సకాలంలో బిల్లులు చెల్లించక కూలీలు అష్టకష్టాలు పడుతున ్నారు. తీవ్రమైన ఎండలో కష్టపడి పనిచేస్తున్నా, వేతనాలు చేతికి రాకపోవ డంతో కూలీలకు అరిగోస తప్పడం లేదు.

తెలంగాణలో ఈ పథకం అమలు అస్తవ్యస్తంగా తయారైంది. రాష్ట్రం తన వంతు నలభై శాతం నిధులను గత మార్చి బడ్జెట్‌‌లో చూపలేదు. దీంతో అరవై శాతం నిధులను ఇవ్వడానికి మోడీ సర్కారు ససేమిరా అంటున్నది.అత్తెసరు కేటాయింపులే చేసింది. నిజానికి కేంద్రం సైతం పెంచిన 125 పని దినాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్‌‌లో నిధులు కేటాయించాలి. అధికారిక లెక్కల ప్రకారం రూ.2.50 లక్షల కోట్లు బడ్జెట్‌లో చూపాల్సి ఉండగా, రూ.95,692 కోట్ల మేరకు మోడీ సర్కారు ప్రతిపాదించింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన నలభై శాతం వాటాకుగాను ప్రతియేటా రూ.1800 నుంచి రూ.2వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. కాగా తాజా బడ్జెట్‌లో రూ. 228 కోట్లు మాత్రమే చూపింది. దీంతో దొందూ దొందే అన్నట్టు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు పేదల పథకం పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నాయి. ఈ కేటాయింపుల ప్రభావం పనులపై పడుతున్నది.

పని ప్రదేశాల్లో సౌకర్యాలు అంతంతే. టెంట్లు వేయకపోవడం, తాగునీటి వసతి లేకపోవడం, వైద్యసౌకర్యాల గురించి పట్టించుకునే నాథుడే కరువవడం గమనార్హం. ఒకవైపు 200 పనిదినాలు చేసి, రోజూ కూలి రూ.600కు పెంచాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేస్తుంటే, ప్రతియేటా నిధులను తగ్గిస్తున్న కేంద్రంపై ప్రజాసంఘాలు కన్నెర్ర చేస్తునానయి. శుక్రవారం ఉపాధి హామీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసించాయి. తెలంగాణలో ఉన్న రూ.వంద కోట్లకుపైగా ఉన్న పెండింగ్ బిల్లులు చెల్లించాలనీ, వీబీ జీ రామ్‌జీ పథకాన్ని రద్దుచేయాలంటూ ప్రజాసంఘాలు చేపట్టిన గ్రామీణ బంద్ సక్సెస్ అయింది. భారీ సంఖ్యలో ఉపాధి కూలీలు ఈ బంద్‌లో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాన్ని ప్రశ్నించారు. ధర్నాలు, పోరాటాలు, ఉద్యమాల ద్వారా సాధించుకున్న పథకాన్ని నాశనం చేస్తే సహించేది లేదని గర్జించారు. చట్టబద్దతకలిగిన పాత పథకాన్నే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -