– గన్ని బ్యాగులు లేక సొసైటీ ముందు రైతులు రోజులతరబడి పడికపులు
– పట్టించుకొని అధికారులు
నవతెలంగాణ – కంది: మండల కేంద్రంలోని సొసైటీ గేట్ ముందు రైతులు గన్ని బ్యాగులు ఇవ్వడం లేదని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చిద్రూప, చేర్యాల ఇంద్రకరణ్, కంది తదితర గ్రామాల్లో సొసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినారు. కానీ రైతులకు ఇప్పటివరకు రైతులకు గన్ని బ్యాగులు ఇవ్వక పోవడంతో శనివారం మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ముందు ఆయా గ్రామల రైతులు ధర్నా చేస్తూ నిరసన తెలియచేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత మూడు రోజులనుంచి రైతులు గన్ని బ్యాగుల కోసం పడికపులు కాస్తున్న ఏ ఒక్క అధికారి పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలు లేవని, రైతులకు త్రాగడానికి నీళ్లు కూడా ఏర్పాటుచేయకపోవడం చోచనీయం.మమ్ములను ఎవరు అడుగుతారన్న ధీమాతో అధికారులు ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామ ప్రజలు అంటున్నారు. జిల్లా కేంద్రానికి కుత వేటు దూరంలో ఉన్న సొసైటి లోనే ఇన్ని ఇబ్బందులు ఉంటే జిల్లా కేంద్రనికి 40 , 50కిలోమీటర్ల దూరంలో ఉన్న సొసైటిల పరిస్తితి ఎలా ఉందో అని పలువురూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవతిసుకుని న్యాయం చేయాలని ప్రభుత్వ వేడుకుంటున్నారు.



