క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలింపు
నవతెలంగాణ-కాటారం
కాటారం మండలంలోని నస్తూరిపల్లి గ్రామ క్రాస్ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. కాటారం–మహాదేవపూర్ ప్రధాన రహదారిపై హైదరాబాదుకు ఇసుక లోడుతో వెళ్తున్న లారీని ఎదురుగా వస్తున్న మారుతి సుజుకి Fronx కారు ఢీకొట్టింది. మహదేవపూర్ వైపు నుండి కాటారం దిశగా వస్తున్న ఇసుక లారీని, కాలేశ్వరం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి బలంగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారు రేగొండ మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సబ్బిడి సురేందర్ రెడ్డి (42) – కారు డ్రైవర్, యజమాని సబ్బిడి కిరణ్ రెడ్డి (27) సబ్బిడి రవీందర్ రెడ్డి (60)లు తీవ్రంగా గాయపడ్డారని వారు తెలిపారు. క్షత గాత్రులను వెంటనే అంబులెన్స్ ద్వారా ముందుగా మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం కు తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



