Saturday, May 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరి కొనుగోళ్లలో వేగం పెంచాలి

వరి కొనుగోళ్లలో వేగం పెంచాలి

- Advertisement -

మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ తిర్మల సమ్మయ్య
నవతెలంగాణ-కాటారం

వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఆలస్యం కాకుండా వెంటనే పంపించేలా చర్యలు తీసుకోవాలని PACS కొనుగోలు కేంద్రం ల ఇంచార్జిలకు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పంతకాని తిర్మల సమ్మయ్య సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో శనివారం వరి కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పంతకాని తిర్మల సమ్మయ్య మాట్లాడుతూ ప్రతి…వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఆలస్యం కాకుండా వెంటనే పంపించేలా చర్యలు తీసుకోవాలని PACS కొనుగోలు కేంద్రంల ఇంచార్జిలకు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పంతకాని తిర్మల సమ్మయ్య సూచించారు.

రైతులు ధాన్యాన్ని ప్యాడి క్లీనర్లతో శుభ్రపరిచి, తూర్పార పట్టి, పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆమె సూచించారు. మాచర్ వచ్చే వరకు ధాన్యాన్ని బాగా ఆరబెడితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పూర్తిగా పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. వరి కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, రైతులకు పారదర్శకంగా సేవలు అందించాలని ఆమె కోరారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి జాడి బాపురావు, మండల వ్యవసాయ అధికారి పూర్ణిమ, ఏఈఓలు మౌనిక, ఆస్మా, రాజయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మహేష్ తిరుపతి రావు, అంగోతు సుగుణ, గంట దేవదాస్, PACS సీఈఓ సతీష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -