– ప్రధానోపాధ్యాయులు పి. హరిత
నవతెలంగాణ – అశ్వారావుపేట
కాగితపు కళతో విద్యార్థుల్లో నైపుణ్యం, సృజనాత్మకత పెరుగుతుందని అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి. హరిత అన్నారు. విద్యావారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పాఠశాలలో ప్రత్యేక అవసరాల విద్యార్థులకు కళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాగితపు కళ ద్వారా విద్యార్థులు సృజనాత్మకతతో పాటు వ్యక్తిత్వ లక్షణాలను కూడా అభివృద్ధి చేసుకుంటున్నారని తెలిపారు. కాగితపు కళ వినియోగంతో గణిత భావనలు సులభంగా అవగాహన అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు రంగు కాగితాలతో వివిధ ఆకృతులను తయారు చేసి ప్రదర్శించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు, ప్రత్యేక విద్యాబోధకుడు రాంమోహన్, పాఠశాల సహాయకులు కిషోర్, నర్సింహారావు, కట్టా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కళలతో నైపుణ్యం పెరుగుతుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



