నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు అందుబాటులో ప్రజలకు ఉండడం వలన గ్రామీణ ప్రాంత మారుమూల గ్రామాల వారికి లబ్ధి చేకూరుతున్నదని జుక్కల్ బ్రాంచ్ మేనేజర్ సదానందం అన్నారు. శనివారం బ్రాంచ్ మేనేజర్ సిబ్బందితో సమావేశం నిర్వహించి, బ్యాంకులో నిర్వహిస్తున్న సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలిసే విధంగా అధికారులు కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జుక్కల్ బ్రాంచ్ మొత్తంగా వ్యవసాయ రుణాలకు సుమారుగా 5000 పైచిలుకు రైతులకు వంట రుణాలు ఇవ్వడం జరిగిందని, ఇదేకాక సేవింగ్స్ ఖాతాకు సంబంధించి 60 వేల ఖాతాదారులకు సేవలు అందిస్తున్నామని వెల్లడించారు.
హౌసింగ్ లోన్స్ ఇతర ఆధ్వర్యంలో కలిపి మొత్తం 90 వేల పైచిలుకు ఖాతాలను ప్రజలకు సేవలు అందించే విధంగా సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజులలో బ్యాంకులు రైతుల సేవలు నిత్యం సేవలందిస్తామని, ఎటువంటి సమస్యలు ఎదురైనా నేరుగా బ్రాంచ్ మేనేజర్ ని కలిసి తమ సమస్యలను విన్నవించుకోవాలని సూచించారు. అదేవిధంగా కేవలం రూ.20 చెల్లించి రెండు లక్షల కవరేజీ బీమా సౌకర్యం కల్పించబోతుందని అన్నారు. వీటి విషయంలో గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని యువకులకు, విద్యావంతులకు, రైతులకు, ప్రజలకు, పిలుపునిచ్చారు. పట్టణ ప్రాంతాలలో ప్రజలకు సేవలు చేయడం కంటే గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు సేవలు అందించడంలో ఎంతో సంతోషం ఆనందం కలుగుతుందని మేనేజర్ అన్నారు.
సిబ్బంది కొరత ఉన్న సమస్యలు లేకుండా లబ్ధిదారులకు సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. జుక్కల్ మండలంలోని ఎక్కడైనా మరో ఎస్బిఐ బ్రాంచ్ ఏర్పాటుచేయాలని రైతులు బ్రాంచ్ మేనేజర్ కు తెలపడంతో మేనేజర్ మాట్లాడుతూ.. తమ వంతుగా కృషిచేసి పై అధికారులకు తెలియజేస్తామని, బ్యాంకు నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల పర్యవేక్షణ చేసి నిర్ణయాలు చేస్తారని అన్నారు. అవసరం ఉంటే ఇంకో బ్రాంచ్ కూడా ఏర్పాటు చేయడానికి బ్యాంకు నిపుణుల కమిటీ నిర్ణయిస్తుంది అని పేర్కొన్నారు.



