Saturday, May 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డీజిల్, పెట్రోల్ ధరల పెంపును ఉపసంహరించుకోవాలి

డీజిల్, పెట్రోల్ ధరల పెంపును ఉపసంహరించుకోవాలి

- Advertisement -

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు
నవతెలంగాణ-నెల్లికుదురు 

కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలను పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు కేంద్ర ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. శనివారం మండల కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోలు డీజిల్ సిఎన్జి ధరలు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పెట్రోలు డీజిల్ లీటర్కు మూడు రూపాయలు  చొప్పున పెంచడం వల్ల ఇప్పటికే ద్రవ్యోల్బణం నిరుద్యోగం స్తంభించిపోయిన ఆర్థిక సంక్షోభంలో సతమతమవుతున్న శ్రామిక ప్రజలపై మరిన్ని భారాలు పడతాయని ఆవేదన వ్యక్తం చెందారు.

అంతర్జాతీయ ధరల హెచ్చుతగ్గులకు లోనైనప్పుడు ఆ భారాన్ని తక్షణమే సామాన్య ప్రజల భుజాల పైకి నెట్టాలని చూస్తున్నారు. రవాణా ఖర్చులపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా నిత్యవసర వస్తువులు వ్యవసాయ ఉత్పాదకాలు మరియు ప్రాథమిక సేవల ధరలు పెరుగుదలతో సహా ఆర్థిక వ్యవస్థ అంతటా ఇవి గొలుసుకట్టు ప్రభావాన్ని ప్రేరేపించడం ఖాయమని అన్నారు. ఈ ధరల పెంపు వల్ల ఆటో డ్రైవర్లు రవాణా కార్మికులు, సరసమైన ప్రజా బాగస్వామ్య రవాణా పై ఆధారపడిన లక్షలాది మందిని నేరుగా ప్రభావితం చేస్తుంది అని తెలిపారు. పెట్రోల్ డీజిల్ దరల పెంపును తక్షణమే వెనక్కి తీసుకోవాలని నెల్లికుదురు సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు భూక్య బిక్షపతి బండ వెంకన్న ఇసం పెళ్లి ఐలేష్ సురేష్ ఉప్పలయ్య పూజారి రవి సంపత్ బిక్షపతి హరీష్ మహేందర్ శేఖర్ కే శ్రీను నరేష్ ఐలయ్య బి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -