బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య
నవతెలంగాణ-తుంగతుర్తి
కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ పై లీటరుకు రూ.3 పెంచి సామాన్యులపై పెను భారం మోపిందని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలియచేస్తూ రాస్తారోకో చేశారు. ఆటోను తాడుతో లాగి నిరసన తెలియ చేశారు. పెట్రోల్, డీజిల్ పై లీటరు కు రూ.3 పెంచడం వలన నిత్యావసర వస్తువులపై అధిక ధరలు పెరిగి జీవనం కృంగి పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్. మండల నాయకులు మల్యాల రాములు, సోమేష్, లక్ష్మయ్య, మల్లేష్, సింహాద్రి, సర్పంచ్ రమేష్, మహేష్, కదారి దాసు, ఉప్పల వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



