- Advertisement -
నవతెలంగాణ – బొమ్మలరామారం: బొమ్మలరామారం మండల మర్యాల జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 2004-2005 పదోతరగతి చదివిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు రవివర్ధన్, రంగారావు,బిక్షమయ్యను ఘనంగా సన్మానించారు.అనంతరం వారి జ్ఞాపకాలను విద్యార్థులతో ఉపాధ్యాయులు పంచుకున్నారు. విద్యార్థిని, విద్యార్థులు వారు చదువుకున్న రోజుల్లో కొన్ని సంఘటనలను గర్తు చేసుకొని సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -