Tuesday, May 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమంత్రుల కమీషన్‌ కోసమే ధాన్యం కటింగ్‌

మంత్రుల కమీషన్‌ కోసమే ధాన్యం కటింగ్‌

- Advertisement -

సివిల్‌ సప్లై శాఖ మంత్రికి సోయి లేదు..: మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
ధాన్యం కొనుగోళ్లు వేగవేంతం చేయాలని ధర్నా

నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మంత్రులకు కమీషన్‌ ఇచ్చేందుకే రైతుల ధాన్యంలో మిల్లర్లు కటింగ్‌ చేస్తున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలంటూ డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యం లో నల్లగొండ కలెక్టరేట్‌ ఎదుట సోమవారం రైతులతో కలిసి మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రుల కు తెలిసే ధాన్యంలో కటింగ్‌ పెడుతున్నారని, మిలర్ల వద్ద కమీషన్లు తీసుకోవడానికే వారు మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ సర్కార్‌ రాకముందు రైతులు ధర్నా చేయని రోజూ లేదని, మళ్లీ 12 ఏండ్ల తర్వాత అదే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌ వల్ల రైతులు మళ్లీ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్‌ సప్లై శాఖ మంత్రికి సోయి లేదని.. కనీసం రివ్యూ చేసే తీరిక లేదని విమర్శిం చారు. తరుగు పేరుతో రైతులను దోచుకుంటుంటే పట్టడం లేదు.. క్వింటాల్‌కు పది కిలోలు కట్‌ చేస్తున్నా మంత్రులు అడ్రస్‌ లేరని ఎద్దేవా చేశారు. జిల్లాకు చెందిన ఇద్దరూ మంత్రులకు ఎలా దోచు కోవాలి.. దాచుకోవాలనే ధ్యాసనే ఉందన్నారు. మోడీ- చంద్రబాబుకు పుట్టిన హైబ్రిడ్‌ కాంగ్రెస్‌ ప్రస్తుతం అధికారంలో ఉన్నదన్నారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ మాట్లా డుతూ.. రైతులు పండించిన పంటను అమ్ముకోవ డానికి అష్టకష్టాలు పడుతుంటే.. కల్లాల వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు హైడ్రామా చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనిపించారన్నారు. రైతుల పక్షాన ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా.. ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రం మెడలు వంచి కొనిపించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, బీఆర్‌ఎస్‌ జిల్లాధ్యక్షులు రవీంద్ర కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, గాదరి కిశోర్‌ కుమార్‌,చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి, ఒంటెద్దు నర్సింహారెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మెన్‌ మందడి సైదిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టే మల్లి కార్జున్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, బత్తుల అనంతరెడ్డి, రావుల శ్రీనివాసరెడ్డి, తండు సైదులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -