Tuesday, May 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజలమండలి జీఎం నివాసంలో ఏసీబీ సోదాలు

జలమండలి జీఎం నివాసంలో ఏసీబీ సోదాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: జలమండలి జీఎం ఎస్‌.ఎల్‌ కుమార్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని అతని బంధువుల ఇళ్లలోనూ ఒకేసారి సోదాలు చేశారు. మల్లాపూర్‌లోని కుమార్‌ నివాసంలో రూ.1.10 కోట్ల నగదు, కిలోన్నర బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్‌లో 3 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో 6 ఓపెన్‌ ప్లాట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -