Thursday, May 21, 2026
E-PAPER
Homeఆటలుఒక్క బెర్తు.. రేసులో ఐదు జట్లు

ఒక్క బెర్తు.. రేసులో ఐదు జట్లు

- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-19 లీగ్ దశ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సీజన్ ఆరంభంలో అదరగొట్టిన పంజాబ్, రాజస్తాన్ జట్లు ఆ తర్వాత వరుస పరాజయాలతో ప్లే-ఆఫ్స్ బెర్త్ ను ఖాయం చేసుకోలేకపోయాయి. ఇక కోల్ కతా, ఢిల్లీ, చెన్నై చివరి మ్యాచుల్లో గెలిచి ప్లే-ఆఫ్స్ బెర్తును కొట్టేయాలని ఎదురు చూస్తున్నాయి. ఎం. చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో గెలిచిన సన్ రైజర్స్ ప్లే-ఆఫ్స్ కు చేరగా.. ఈ గెలుపుతో గుజరాత్ కూడా నేరుగా నాకౌట్ బెర్త్ కొట్టేసింది. సీజన్ ఆరంభంలో అదరగొట్టిన లక్నో సూపర్ జెయింట్స్, ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ చివరి 4 మ్యాచులు మిగిలి ఉండగానే ఎలిమినేట్ అయ్యాయి.

ప్లే-ఆఫ్స్ బెర్త్ పై ఉత్కంఠ…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) 13 మ్యాచుల్లో 9 విజయాలతో 18 పాయింట్లతో, సన్ రైజర్స్, గుజరాత్ జట్లు 13 మ్యాచుల్లో 8 విజయాలతో 2, 3 స్థానాల్లో నిలిచి ప్లే-ఆఫ్స్ కు చేరాయి. ఇక రాజస్తాన్ 13 మ్యాచులు ముగిసేసరికి 14పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నా ప్లే-ఆఫ్స్ కు చేరలేదు. పంజాబ్ 13 పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా.. చెన్నై, ఢిల్లీ 12 పాయింట్ల తో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక కోల్ కతా 12మ్యాచ్ లు ముగిసేసరికి (11పాయింట్లు) 8వ స్థానంలో ఉన్నాయి.

రాజస్తాన్, కోల్ కతా కు కీలకం…
రాజస్తాన్, కోల్ కతా జట్లు చివరి మ్యాచుల్లో విజయాలతో సమీకరణలు మారతాయి. రాజస్తాన్(+0.0813) 4వ స్థానంలో ఉండగా.. కోల్ కతా(-0.038) 12మ్యాచ్ లు ముగిసేసరికి 11 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. రాజస్తాన్ జట్టు 19న లక్నోపై భారీ లక్ష్యాన్ని ఛేదించి 23న పంజాబ్ తో మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది. ఈ మ్యాచ్ లో రాజస్తాన్ గెలిస్తే 16పాయింట్లతో 4వ స్థానానికి చేరి ప్లే-ఆఫ్స్ బెర్త్ కొడుతుంది. ఒకవేళ పంజాబ్ గెలిస్తే 15పాయింట్ల తో ప్లే-ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. రాజస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమి స్తుంది. మరోవైపు కోల్ కతా 20న ముంబయి, 24న ఢిల్లీపై గెలిస్తే.. పంజాబ్, కోల్ కతాలో 15పాయింట్లతో సమానంగా ఉంటాయి. దీంతో మెరుగైన రన్ రేట్ కలిగిన జట్టు నాకౌట్ చేరుతుంది. ఇప్పటికే 13 మ్యాచ్ లు ఆడేసిన ఢిల్లీ, చెడేసిన12 పాయింట్లతో ఉన్నా.. చివరి మ్యాచుల్లో గెలిస్తే సమీకరణలు, మెరుగైన రన్ రేట్ కీలకంగా మారనుంది. ఢిల్లీ జట్టు కోల్ కతాపై, చెన్నై జట్టు గుజరాత్ పై, పంజాబ్ జట్టు లక్నో పై చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ జట్లు చివరి మ్యాచ్ లో గెలిస్తే మెరుగైన రన్ రేట్ సాధించిన జట్టు ప్లే-ఆఫ్స్ కు చేరుతుంది. పంజాబ్ జట్టు చివరి మ్యాచ్ లో ఇప్పటికే ఎలిమినేట్ అయిన లక్నోతో తలపడనుంది. ఆ మ్యాచ్ లో పంజాబ్ గెలిస్తే 15పాయింట్లతో టాప్-4లో నిలిచి ప్లే-ఆఫ్స్ కు చేరుతుంది. వీటితోపాటు కోల్ కతా, రాజస్తాన్ చివరి మ్యాచుల్లో ఓటమిపాలవ్వాలి.

స్పోర్ట్స్ కరస్పాండెంట్

కోల్ కతా – ముంబయి మ్యాచ్ కు వర్షం అడ్డంకి
ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం జరిగే కోల్ కతా – ముంబయి మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలిచాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం కురిసి మైదానం చిత్తడిగా మారింది. టాస్ గెలిచిన కోల్ కతా కెప్టెన్ అజింక్యా రహానే బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ కు దిగిన ముంబయి 8 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. ఆ దశలో మరోదఫా వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచింది. ఆ సమయానికి క్రీజ్ లో తిలక్ వర్మ(7), హార్దిక్ పాండ్యా(7) ఉన్నారు. రికెల్టన్(6), రోహిత్(15), నమన్ ధీర్(0), సూర్యకుమార్(15) ఔట్ కాగా.. కోల్ కతా బౌలర్లు సౌరభ్ దూబే, గ్రీన్ కు రెండేసి వికెట్లు దక్కాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -