నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ అధ్యక్షతన జిపి కార్యకర్తలు, బిజిఎస్ సిబ్బందితో వారం తప్పు సమావేశం నిర్వహించడం జరిగిందని ఎంపీ ఓ రాముని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ అధికారులు ప్రతి ఒక్కరు గ్రామాలలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండడమే కాక ప్రజల సమస్యలు తమ వరకు రాకుండా అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యదర్శిలు మరియు ఉపాధి సిబ్బంది నిర్దేశించి మాట్లాడుతూ గ్రామాలలో ఉపాధ్యామి కూలీల సంఖ్యను పెంచాలని అన్నారు. చేయూత పెన్షన్లు, నూతన పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, సిబిఎస్ పెన్షన్ అథేంటికేషన్, సెన్సెస్ సర్వేలు నిర్వహిస్తున్న అధికారులతో కలిసి గ్రామాలలో అభివృద్ధి పనులపై అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఉపయోగపడే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు.
గ్రామాలలో నీటి సమస్య తలెత్తకుండా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులకు అవగాహన ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా గ్రామాల్లో పేరుకుపోయిన పన్నులను 100% వసూలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము, ఏపీవో తులసి రామ్, ఈసీ స్వామి దాస్, టెక్నికల్ అసిస్టెంట్లు, 30 గ్రామపంచాయతీలో కార్యదర్శులు , ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



