కుల సంఘాల జిల్లా చైర్మన్ పీక కిరణ్
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం వల్లెంకుంట గ్రామపరిధి మానేరు ఒడ్డున సాగు నీరు కోసం నిర్మాణ దశలో ఉన్న ఎత్తిపోతల పథకాన్నీ వెంటనే ప్రారంభించాలని కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ భూపాలపల్లి జిల్లా చైర్మన్ పీక డిమాండ్ చేశారు. శుక్రవారం కొయ్యుర్లో కుల సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మాట్లాడారు ఓసిపి బ్లాక్-1 మైన్లో కోల్పోయిన కాపురం ఆదివాసులకు ఏఎమ్మార్ కంపెనీ ఇండ్లు నిర్మించి, అర్హులైన వారికి ఉపాది కల్పించాలని కోరారు.
మహముత్తారం మండలం బోర్లగూడెంలో రెండు టీఎంసీల సరిపడా రిజర్వాయర్ నిర్మాణం చేసి 15 గ్రామ పంచాయతీల రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అనంతరం కుల సంఘాల జేఏసీ మండల కమిటి వేశారు.మండల కన్వీనర్ దేవి భూమయ్య,కో కన్వీనర్ బోయిన రాజన్న యాదవ్,కో-ఆర్డినేటర్ లుగా వేల్పుల నారాయణ,బర్ల గట్టయ్య, పైడాకుల సమ్మయ్య,మందిని రాజ్ కుమార్ మద్దెల లక్ష్మణ్,విజయగిరి సమ్మయ్య, గడ్డం లచ్చన్న,ఒల్లాల సంపత్,బండారి శంకరయ్య,ధారావత్ కిషన్, ఓదెల బ్రాహ్మచారి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అజ్మీరా ఫుల్ సింగ్,కో కన్వీనర్ ఐత బాపు పాల్గొన్నారు.



