Friday, May 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్50% శాతం సబ్సిడీతో జీలుగు విత్తనాలు..

50% శాతం సబ్సిడీతో జీలుగు విత్తనాలు..

- Advertisement -

సబ్సిడీ బ్యాగులు అందించిన అధికారులు ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-వర్ధన్నపేట
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 50 శాతం సబ్సిడీతో జీలుగ విత్తనాలు వర్ధన్నపేట ఇల్లంద అగ్రోస్ సేవా కేంద్రాలలో అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. వర్ధన్నపేట ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, వద్ద 834 జీలుగు విత్తనాల బ్యాగులు, ఇల్లంద ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, ఇల్లంద వద్ద 500 జీలుగు విత్తనాల బ్యాగులు రైతులకు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. అవసరమైన రైతులు తమ ఆధార్ కార్డు జిరాక్స్ పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ ఆయా కేంద్రాల సమర్పించి విత్తనాలు పొందాలన్నారు. ఇల్లంద గ్రామంలో సబ్సిడీపై బ్యాగులను అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇల్లంద మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, మండల వ్యవసాయ శాఖ అధికారి, విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ బేతి సాంబయ్య, స్థానిక పలు పార్టీలకు చెందిన నాయకులు పోశాల వెంకన్న, అడుపరాజు, గుడిషాల శ్రీనివాస్, బొచ్చు యాదగిరి, స్థానిక రైతులు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -