Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్వే అధికారులతో మండల స్థాయి సమీక్ష సమావేశం

సర్వే అధికారులతో మండల స్థాయి సమీక్ష సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని 30 గ్రామ పంచాయతీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న  2026 సెన్సెస్  సూపర్వైజర్లు, సర్వే అధికారులు , ఎమ్యునేటర్ లతో మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని తహసిల్దార్ మారుతి  తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాలలో  సెన్సెస్ సర్వేలో పాల్గొన్న అధికారులు, ఎమ్యునేటర్ లు , జిపివోలు , జరిపి కార్యదర్శి, గ్రామ సర్పంచ్ లు సహకారంతో సర్వేలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ప్రస్తుతం మ్యాపింగ్ కార్యక్రమం కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని  అన్నారు. మూడు రోజుల శిక్షణలు పొందిన అనంతరం సెన్సేస్ సర్వే కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులు  నిర్దేశించిన గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ రోజులలో పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలో పురోగతి గురించి ఒక్కొక్క అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు మండల స్థాయి అధికారులు పూర్తిస్థాయిలో తమకు మద్దతు ఉంటుందని వారికి తెలియజేశారు.

కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ తో పాటు , తాహసిల్దార్ మారుతి, ఆర్ఐ రామ్ పటేల్ , తాహసిల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్, ఎంపీడీవో కార్యాలయం ఎంపీ ఓ రాము,  సూపరింటెండెంట్  క్రాంతి కుమార్ , జూనియర్ అసిస్టెంట్ అనిల్, సీనియర్ అసిస్టెంట్ కులకర్ణి , సర్వే చేస్తున్న అధికారులు, ఎమ్యునేటర్ లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -