నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో నీటి స్వచ్ఛ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యెంబరి విద్య ఆధ్వర్యంలో కౌలాస్ మరియు కోటలోని నీటి స్వచ్ఛత అనే అంశంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గ్రామ పంచాయతీ సెక్రెటరీ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నీటి స్వచ్ఛత, లభ్యత, నీటీవృధా, అనే అంశాలను గ్రామస్తులతో కలిసి కవుల స్కూటర్ ప్రత్యేకంగా అవగాహన నిర్వహిస్తూ చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రెండోసారి విద్య మాట్లాడుతూ కౌలాస్ కోట పక్కన పెద్ద చెరువు కాలువ ఉందని అదేవిధంగా కోటాలు పలు బావులు, చెరువులు, కొలనులు, పూర్వం రాజవంశస్తులు నిర్మించడం జరిగింది.
ప్రస్తుతం అది శిథిలమైనప్పటికీ బావులలో చెరువులలో చెత్తాచెదారం ప్లాస్టిక్ వస్తువులు నిండిపోవడంతో జలవన్రులతో పాటు వన్యప్రాణులకు, మృగాలకు కలుషిత నీరు తాగుతున్నాయని అన్నారు. చుట్టుపక్కల దట్టమైన అడవులు ఉండడంతో కోటాలో కూడా నిర్మాణస్యంగా ఉండడం వలన మృగాలు నీటిని తాగేందుకు చెరువులకు, బావులకు వస్తూ ఉంటాయని తెలిపారు. కోట అవుతల వైపు వ్యవసాయదారులు, కూలీలు కూడా ఆ బావులలో ఉన్న నీటిని త్రాగునీరుగా ఉపయోగిస్తారని అన్నారు.
స్వచ్ఛమైన నీరు అందించాలని దూడ సంకల్పంతో గ్రామస్తులకు చెరువులలో బావులలో నిండిపోయిన మట్టిని తొలగించాలని మరియు అందులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా తొలగించి వన్యమృగాలకు ,వ్యవసాయదారులకు , నీటిలో నివసించే జంతువులకు, కూలీలకు స్వచ్ఛమైన నీటిని అందించే విధంగా గ్రామస్తులందరూ సహకరించాలని గ్రామ సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ జిపి కార్యదర్శి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



